సినిమా మేకర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ను అంత ఈజీగా ఒప్పుకోరు, సక్సెస్ అయితే పర్వాలేదు కానీ ఒకవేళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పొతే మట్టుకు లేదు ఆ సినిమా సక్సెస్ ఫుల్ సినిమానే అని ఒప్పించడానికి తెగ కష్టపడుతూ ఉంటారు. రీసెంట్ టైం లో ఇలాంటి వ్వయహారం పాగల్ సినిమా తో చూశాం, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక వర్గం నుండి పాజిటివ్ టాక్ ను…
మరో వర్గం నుండి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా హీరో విశ్వక్ సేన్ ప్రతీ చోట సినిమా సక్సెస్ మీట్స్ పెట్టి సినిమా హిట్ హిట్ అంటూ ప్రచారం చేశాడు. ఇప్పుడు అదే విధంగా లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా…
విషయం లో కూడా రిపీట్ అవుతుంది అని చెప్పాలి. సుధీర్ బాబు మరీ విశ్వక్ సేన్ లెవల్ లో హిట్ హిట్ అంటూ మైకుల ముందు ఏమి చెప్పక పోయినా కానీ సోషల్ మీడియా లో ప్రతీ ట్వీట్ లో కూడా ఇది ఆడియన్స్ హిట్ సినిమా అని… రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ అంటూ…
సినిమా పై వేసే ప్రతీ ట్వీట్ లో కూడా హాష్ టాగ్స్ ని మెన్షన్ చేస్తూ వస్తున్నాడు. కానీ అక్కడ థియేటర్స్ లో సినిమాకి అనుకున్న రేంజ్ లో జనాలు లేక ఇప్పుడు బిజినెస్ వైజ్ భారీ నష్టాలను సొంతం చేసుకోబోతుంది సినిమా… ఓవరాల్ గా నిర్మాతలు సినిమా ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకున్నారు కానీ…
సినిమాను 8 కోట్లు పెట్టి కొన్న బయ్యర్స్ ఇప్పుడు సినిమా వల్ల నష్టాలు సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు. అయినా కానీ ఇంకా ఆడియన్స్ హిట్ రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ కొంచం విచిత్రంగా ఉన్నాయి. వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి చూశాక కూడా ఇంకా ప్రమోట్ చేస్తూ ఉండటం మాత్రం సినిమా మీద టీం కి ఉన్న ప్రేమకి నిదర్శనం, కానీ జనాలే అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రావడం లేదు.