ఓ చిన్న పాయింట్ తో మలయాళంలో డీసెంట్ థ్రిల్లర్ లు ఎన్నో వచ్చాయి, ఈ సారి డిఫెరెంట్ గా సూపర్ నాచురల్ పాయింట్ తో మలయాళంలో అప్ కమింగ్ స్టార్స్ తో చేసిన చిన్న సినిమా పడక్కలం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది…
డిస్నీ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ భాషల్లో డబ్ అవ్వగా…తెలుగు డబ్ వర్షన్ ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల క్రితం…
ఆదిత్య మహారాజు ఒక ప్రత్యేక వస్తువుని తయారు చేయించుకుంటాడు, తర్వాత టైంలో కొంత మంది చేతులు మారిన ఆ వస్తువు అనుకోకుండా ఒక కాలేజ్ ప్రొఫెసర్ చేతికి వస్తుంది. ఆ వస్తువుతో తను అనుకున్నది ఆ ప్రొఫెసర్ ఎలా సాధించాడు..ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న…
హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ కి ఆ ప్రొఫెసర్ కి మధ్య జరిగిన పోటిలో హీరో గెలిచాడా లేదా అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్…కొన్ని లిమిటెడ్ పాత్రల చుట్టూ తిరిగిన సినిమా కథ పాయింట్ యూనిక్ గా అనిపించగా ఫస్టాఫ్ చాలా బాగా ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగించింది…
ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో కిక్ ఇచ్చి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగేలా చేయగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం రొటీన్ గానే సాగినా కూడా ఓవరాల్ గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ చివరి వరకు కొనసాగించి మొత్తం మీద డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించేలా ఆకట్టుకుంది.
ఫస్టాఫ్ ఉన్నంత రేంజ్ లో సెకెండ్ ఆఫ్ కూడా ఉండి ఉంటే మరో లెవల్ లో ఉండేది సినిమా…అయినా కూడా ఇలాంటి యూనిక్ పాయింట్ ని ఎంచుకుని లిమిటెడ్ పాత్రలు ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని ఎంటర్ టైన్ మెంట్ అండ్ ఎక్సైట్ ను చివరి వరకు మెయిన్ టైన్ చేసి…
ఓవరాల్ గా ఎబో యావరేజ్ రేంజ్ లో మెప్పించాడు డైరెక్టర్…. లెంత్ కూడా తక్కువే అవ్వడంతో ఎక్కడా పెద్దగా బోర్ అయిన ఫీలింగ్ ఏం రాలేదు… మొత్తం మీద రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయిన ఆడియన్స్ ఈ సినిమా ను కచ్చితంగా ఎంజాయ్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.