Home గాసిప్స్ 8 ఏళ్ళుగా హిట్ లేదు…అయినా పక్కా కమర్షియల్ ప్రాఫిట్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

8 ఏళ్ళుగా హిట్ లేదు…అయినా పక్కా కమర్షియల్ ప్రాఫిట్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన సినిమాలకు బిజినెస్ పరంగా సాలిడ్ రేట్స్ సొంతం అవ్వడం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, అందుకే గోపీచంద్ తో సినిమాలు కొంచం బడ్జెట్ ఎక్కువ అయినా కానీ పెట్టడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటూ వస్తున్నారు. రీసెంట్ గా గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ మూవీ గీతా ఆర్ట్స్ అండ్ యువి క్రియేషన్స్ వాళ్ళు కలిసి నిర్మించారు…

సినిమా కి మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో 14-15 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయిందని టాక్ ఉంది, ఇక సినిమా ఓవరాల్ బిజినెస్ ఓన్ గానే ఉన్నప్పటికీ ట్రేడ్ లెక్కల్లో హిట్ కి టార్గెట్ కావాలి కాబట్టి ఒక లెక్క చెప్పినా టోటల్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేశారు,

ఇక తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం సినిమాను 1.70 కోట్లకు అమ్మారు. ఇక సినిమా టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా కలిపి 31 కోట్ల రేటుని సొంతం చేసుకుంది. దాంతో వర్త్ బిజినెస్ 32.70 కోట్లు అవ్వగా పబ్లిసిటీ కోసం 1.50 కోట్ల మేర ఖర్చు చేశారు అనుకున్నా టోటల్ గా 31.2 కోట్ల వర్త్ బిజినెస్ జరిగింది అనుకోవచ్చు…. అంటే బడ్జెట్ మీద ఏకంగా 16 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ నిర్మాతలకు ఆల్ రెడీ సొంతం అయ్యాయి అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here