Home గాసిప్స్ 8 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు….అయినా ఇన్ని కోట్లు ఏంటి సామి!!

8 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు….అయినా ఇన్ని కోట్లు ఏంటి సామి!!

0

బాలీవుడ్ ని ఒకప్పుడు ఏక చక్రాదిపత్యంగా ఏలిన హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్…. తన పోటీ హీరోలు అమీర్ మరియు సల్మాన్ ల నుండి అనుకున్న రేంజ్ మూవీస్ రాని టైం లో, అలాగే కొన్ని హిట్స్ అయినా కానీ వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ ఇండియా లో ఓవర్సీస్ లో తిరుగు లేని రికార్డులను నమోదు చేసిన కింగ్ ఖాన్ కి చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత….

ఆ రేంజ్ లో హిట్ అయితే అస్సలు సొంతం కాలేదు అనే చెప్పాలి. 2014 టైం లో మాత్రం హ్యాప్పీ న్యూ ఇయర్ మూవీ ఉన్నంతలో హిట్ మూవీ అనిపించుకోగా తర్వాత చేసిన ఏ సినిమా కూడా హిట్ గీతని అందుకోలేదు. ఈ లోపు సల్మాన్ మరియు అమీర్ ఖాన్ లు…

సినిమా సినిమాకి కొత్త రికార్డులు నమోదు చేస్తూ షారుఖ్ ఖాన్ ని మించి పోయారు….షారుఖ్ కి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ మీద దెబ్బ పడగా 2018 లో జీరో ఆల్ టైం డిసాస్టర్ అవ్వగా నాలుగేళ్ళు గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు 2023 లో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర….

2 ఊరమాస్ సినిమాలతో ఒక క్లాస్ మూవీతో రంగంలోకి దిగుతున్నాడు, వార్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పటాన్, రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో డంకీ ఇక అట్లీ డైరెక్షన్ లో జవాన్ చేస్తున్న షారుఖ్ ముందుగా పటాన్ ని వచ్చే ఇయర్ జనవరి 25న రిలీజ్ చేస్తూ ఉండగా ఈ సినిమా లో షారుఖ్ తో పాటు జాన్ అబ్రహం మరియు దీపికా పదుకునే కూడా నటిస్తూ ఉండగా…

ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది, యాక్షన్ మూవీనే అయినా కానీ ఏకంగా 220 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో అత్యంత స్టైలిష్ గా ఈ సినిమా రూపొందుతుంది అని సమాచారం. 200 కోట్ల నెట్ మార్క్ ని షారుఖ్ అందుకుని 8 ఏళ్ళు అవుతుంది, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న షారుఖ్ రీసెంట్ఈ గా బ్రహ్మాస్త్ర లో స్పెషల్ రోల్ లో బాగా మెప్పించాడు… ఇక పటాన్ సినిమా ఈ బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేయడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here