Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ మూవీ…ఒక్క రోజు ముందు డేట్ అనౌన్స్ చేశారుగా!!

ఇండస్ట్రీ హిట్ మూవీ…ఒక్క రోజు ముందు డేట్ అనౌన్స్ చేశారుగా!!

0

బాలీవుడ్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డులతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఆల్ టైం ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సినిమా పఠాన్, పాత ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి వరల్డ్ వైడ్ గా చైనా రిలీజ్ లేకుండానే ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న పఠాన్ మూవీ లైఫ్ టైం టోటల్ కలెక్షన్స్ లెక్క మొత్తం మీద…

1050 కోట్ల లోపు ఉండబోతుండగా రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా 800 స్క్రీన్స్ కి పైగా చోట్లా 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకుని ఇప్పటికీ కలెక్షన్స్ ని లిమిటెడ్ గా సొంతం చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడని కూడా ఎవ్వరూ ఎదురు చూడకుండా ఇప్పటికీ…

థియేటర్స్ లో చూస్తూ ఉండగా సడెన్ గా ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ ను ఈ నెల 22న ఉగాది కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఉండబోతుందని అనౌన్స్ చేశారు. మాములుగా అయితే ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ డిజిటల్ రిలీజ్ ను ఊరించి ఊరించి అప్ డేట్ ఇస్తారు కానీ…

పఠాన్ డిజిటల్ రిలీజ్ ను ఒక్క రోజు ముందుగా మాత్రమే పోస్టర్ అప్ డేట్ అలాగే హీరోతో ఒక ప్రోమో రిలీజ్ చేయించి అప్ డేట్ చేశారు. బహుశా డిజిటల్ రిలీజ్ కి ఎక్కువ ప్రమోట్ చేస్తే థియేటర్స్ లో రన్ పై ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకున్నారేమో. మొత్తం మీద ఇండస్ట్రీ రికార్డులను చెల్లాచెదురు చేసిన ఈ సినిమా ఇక డిజిటల్ లో ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here