Home న్యూస్ ఫస్ట్ డే 280…సెకెండ్ డే…130….ఇదికదా షాకంటే!!

ఫస్ట్ డే 280…సెకెండ్ డే…130….ఇదికదా షాకంటే!!

7751
0

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన మూవీ దెయ్యం, రాజ శేఖర్ మెయిన్ రోల్ లో స్వాతి దీక్షిత్ కీలక పాత్రలో నటించిన పట్టపగలు మూవీ ఎప్పుడో 7 ఏళ్ల క్రితమే ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్నా కానీ అనుకోని కారణాల వలన లేట్ అయిన సినిమా పేరు మార్చుకుని ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా దెయ్యం పేరుతో పేరు మారి ఈ వీకెండ్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో పెరిగి పోవడం తో ఆ ఇంపాక్ట్ అన్ని సినిమాల పై కూడా కనిపిస్తుంది. దాంతో కొత్త సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వాషౌట్ అయిపోతున్నాయి. ఇక ఈ సినిమా మొదటి రోజు సుమారు 280 థియేటర్స్ లో రిలీజ్ ను…

సొంతం చేసుకోగా…. మొదటి రోజు మొత్తం మీద కేవలం 2 లక్షల లోపు కలెక్షన్స్ ను మాత్రమె సొంతం చేసుకోగా రెండో రోజు నెగటివ్ షేర్ ను సొంతం చేసుకుంది, ఇక సినిమా మొదటి రోజు 280 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా రెండో రోజు కి వచ్చే సరికి పరిస్థితులు…

కలెక్షన్స్ లేక మరీ దారుణంగా ఉండటం తో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ వలన చాలా థియేటర్స్ నుండి సినిమాను తీసేశారు. ఇక కొన్ని థియేటర్స్ రెంట్స్ కి తగ్గ అమౌంట్ కూడా రాకపోవడం తో ఆ థియేటర్స్ ని మూసేశారు… దాంతో రెండో రోజుకి వచ్చే సరికి సినిమా కేవలం 130 థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తుంది.

సినిమాను 30 లక్షలకు అమ్మగా 50 లక్షల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు ఏ దశలో కూడా ఈ మొత్తాన్ని అందుకోలేదు… దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా డిసాస్టర్ గా నిలవబోతుంది. రామ్ గోపాల్ వర్మ ఖాతాలో అలాగే రాజశేఖర్ ఖాతాలో మరో అట్టర్ ఫ్లాఫ్ గా నిలవ బోతుంది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here