Home టోటల్ కలెక్షన్స్ 55L బడ్జెట్….30 లక్షలకి అమ్మితే…వచ్చింది ఇదీ…ఇదీ రికార్డే!!

55L బడ్జెట్….30 లక్షలకి అమ్మితే…వచ్చింది ఇదీ…ఇదీ రికార్డే!!

5361
0

బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ గోపాల్ వర్మ మూవీస్ ని జనాలు చూడటం ఎప్పుడో మానేశారు. ఏవో అరకొర సినిమాలు అప్పుడప్పుడు ఎదో జనాల్లో కొంత క్యూరియాసిటీ ని క్రియేట్ చేస్తే మినిమమ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నవి ఉన్నాయి కానీ 10 లో 9 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినవే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఓల్డ్ మూవీ పట్ట పగలు సినిమా ను…

పేరు మార్చి దెయ్యం పేరుతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా తీసుకు వచ్చారు. సినిమా ను ఏమి చూసి కొన్నారో బయ్యర్లు 30 లక్షల రేటు పెట్టి కొన్నారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమాను….

తెలుగు రాష్ట్రాలలో 280 థియేటర్స్ లో రిలీజ్ చేయగా ఫస్ట్ డే కి వచ్చిన టాక్ కి సినిమా రెండో రోజే సగానికి పైగా థియేటర్స్ ని కోల్పోయి 130 థియేటర్స్ లో పరుగును కొనసాగించగా సినిమా మొత్తం మీద మొదటి రోజు 2 లక్షల మేర కలెక్షన్స్ ను సాధించగా… బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ ని…

మూసేస్తున్నాం అని చెప్పడం తో దాదాపు కొత్త సినిమాల థియేటర్స్ అన్నీ కూడా మూత బడ్డాయి ఈ సినిమా కూడా అందులో కలిసిపోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 4.5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం. అది కూడా థియేటర్స్ లో డెఫిసిట్ లు అలాగే నెగటివ్ షేర్స్ ని కూడా తీయకుండా…

చెప్పిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమాను ఓవరాల్ గా 55 లక్షల రేంజ్ లో రూపొందించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా తీసుకు రాలేక పోయింది. రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో మరో ఫ్లాఫ్ మూవీ గా రామ్ గోపాల్ వర్మ రికార్డులను అలానే కొనసాగిస్తూ ఈ సినిమా కూడా ఆ రికార్డు లో ఒకటిగా చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here