Home న్యూస్ అజిత్ కుమార్ “పట్టుదల” అడ్వాన్స్ బుకింగ్స్..డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

అజిత్ కుమార్ “పట్టుదల” అడ్వాన్స్ బుకింగ్స్..డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయ‌ర్చి(Vidaamuyarchi) మూవీ కొంచం లేట్ అయ్యి ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ కాబోతూ ఉండగా, బజ్ కూడా అంతగా ఏమి లేక పోయినా కూడా…

సినిమా జస్ట్ అజిత్ కుమార్ క్రేజ్ పవర్ తో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా, తమిళనాడులో మొదటి రోజు కి గాను బుకింగ్స్ అసలు ప్రమోషన్స్ లాంటివి ఏమి లేక పోయినా కూడా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండగా…

ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అక్కడ 15.5 కోట్ల మార్క్ ని దాటేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఓవరాల్ గా మరో 3 కోట్లకు పైగా బుకింగ్స్ జరగగా ఓవర్సీస్ లో 6 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ జరిగాయి. ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ ప్రీ బుకింగ్స్ 24.5 కోట్ల రేంజ్ లో.

జరిగి మాస్ రచ్చ చేసింది. రీసెంట్ కోలివుడ్ మూవీస్ లో ఆల్ మోస్ట్ రజినీకాంత్ వేట్టయన్ మూవీ రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండటం తో సినిమా మొదటి రోజు ఇదే ఫ్లో ని కంటిన్యూ చేస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకునే అవకాశం ఉంది.

తమిళనాడు లో ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తుంటే 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజున 60 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసే అవకాశం ఉండగా…

సినిమాకి వచ్చే టాక్ ను బట్టి కలెక్షన్స్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక తెలుగు లో మాత్రం సినిమా కి పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించే అవకాశం కనిపించడం లేదు, టాక్ సూపర్ పాజిటివ్ గా వస్తే ఇక్కడ సినిమా జోరు చూపించే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here