బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగు లో పట్టుదల పేరుతో డబ్ అయ్యి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా వచ్చింది అన్నది ఆసక్తిగా మారగా…
ప్రీమియర్స్ రిపోర్ట్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి. స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సినిమా స్టార్ట్ అవ్వడం హీరో వెడ్డింగ్ తో స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. హీరో కి విలన్ అర్జున్ కి చిన్న గొడవ పెద్దది అవుతుంది..
ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత కథ ఫ్లాట్ గా మారిపోయి ఓకే అనిపించే సీన్స్ తో సాగినా ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకుని ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా మెప్పించడంతో ఓవరాల్ గా…
ఫస్టాఫ్ డీసెంట్ గా అనిపించగా, సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటే ఇక రచ్చ ఖాయం అనుకున్నా కూడా సెకెండ్ ఆఫ్ కథ ఫ్లాట్ గా మారిపోయిందని చెప్పొచ్చు, అక్కడక్కడా కొన్ని ట్విస్ట్ లు బాగానే ఎలివేట్ అయ్యి యాక్షన్ సీన్స్ కూడా బాగానే మెప్పించినప్పటికీ కూడా..
ఓవరాల్ గా స్టోరీ పాయింట్ చాలా నార్మల్ గా అనిపించింది అని చెప్పాలి. హీరో విలన్ ల గొడవని ఇంకా బాగా ఎస్టాబ్లేష్ చేసి ఉంటే బాగుండేదని అలాగే అనిరుద్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా సాదాసీదాగా అనిపించాయి అని చెప్పాలి.
ఓవరాల్ గా ఫస్టాఫ్ డీసెంట్ అనిపించే రేంజ్ లో ఉండగా సెకెండ్ ఆఫ్ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో ఉందని చెప్పాలి ప్రీమియర్స్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే…..
అజిత్ ఫ్యాన్స్ కి పర్వాలేదు అనిపించినా కామన్ ఆడియన్స్ కి ఎక్కాలి అంటే సినిమా లో ఇంకా మ్యాటర్ ఉండాల్సింది అని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమాకి ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి.