Home న్యూస్ అజిత్ కుమార్ “పట్టుదల” రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

అజిత్ కుమార్ “పట్టుదల” రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయ‌ర్చి (Vidaamuyarchi) మూవీ తెలుగు లో పట్టుదల(Pattudala Review) పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా, పెద్దగా బజ్ ఏమి లేని సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ 12 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ తర్వాత విడిపోవాలని అనుకుంటారు…ఈ క్రమంలో తనని తన ఇంటి దగ్గర దింపాలని బయలు దేరిన తర్వాత కార్ బ్రేక్ డౌన్ అవ్వడంతో హీరోయిన్ అర్జున్-రెజినా ల హెల్ప్ తీసుకుంటుంది…

ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…హాలీవుడ్ లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే సినిమా రీమేక్ గా రూపొందిన పట్టుదల మూవీ లో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఒక టాప్ స్టార్ చేయాల్సిన కంటెంట్ అయితే కాదనే చెప్పాలి.

అజిత్ స్టార్ డం కి తగ్గ సీన్స్ ఏమి పడలేదు, చాలా సాదాసీదా రోల్ లో నటించాడు అజిత్ కుమార్, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలానే టైం పట్టగా ప్రీ ఇంటర్వెల్ నుండి కొంచం జోరు పెరగగా ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించడంతో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా..

ఫస్టాఫ్ ఉండటంతో సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనిపించినా సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా ట్రాక్ తప్పి కథ ఎటు నుండి ఎటో వెళుతూ ఏమాత్రం మెప్పించ లేక పోయింది. ఫ్లాట్ నరేషన్ తో సాగిన సెకెండ్ ఆఫ్ లో అక్కడక్కడా వచ్చిన చిన్న ట్విస్ట్ లు…

పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యాక అసలు ఇది టాప్ స్టార్ చేయాల్సిన సినిమా అయితే కాదు అనిపించింది. అజిత్ కుమార్ తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించే ప్రయత్నం చేసినా కూడా అసలు కథలోనే దమ్ము లేక పోవడంతో….

చేయడానికి ఏమి లేక పోయింది, త్రిష మొదట్లో ఓకే అనిపించినా తర్వాత స్క్రీన్ పై పెద్దగా కనిపించదు, అర్జున్ రెజినా లు పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించారు. ఇక అనిరుద్ అందించిన పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ తన లెవల్ కి…

ఏమాత్రం మ్యాచ్ ఐతే చేయలేక పోయింది అనే చెప్పాలి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాయి, ఇక డైరెక్టర్ ఒక టాప్ స్టార్ కి సెట్ అవ్వని కథ పాయింట్ ని రీమేక్ గా ఎంచుకుని ఏమాత్రం న్యాయం చేయలేక పోయాడు…

అజిత్ ఫ్యాన్స్ కి కొంచం పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా ఎక్కే అవకాశం తక్కువే అని చెప్పాలి. మరీ ఓపిక పట్టి చూస్తె ఎలాగోలా బోర్ ఫీల్ అవుతూ ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది సినిమా…సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here