టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటె 2020 ఇయర్ లో సమ్మర్ లో వకీల్ సాబ్ ను, అక్టోబర్ లో క్రిష్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ని రిలీజ్ చేసి దుమ్ము లేపేవాడు కానీ కరోనా వలన సినిమాలు అన్నీ ఆగిపోవడం తో ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాను…
వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయబోతున్న పవర్ స్టార్, తర్వాత కూడా భారీగా సినిమాలను కమిట్ అవ్వగా అందరికీ షాక్ ఇస్తూ చివరగా ఓకే అయిన మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ ని వకీల్ సాబ్ తర్వాత మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యాడు.
ఈ సినిమా తెలుగు రీమేక్ ముందు ఇతర స్టార్స్ దగ్గరకు వెళ్ళినా చివరికి పవన్ కళ్యాణ్ దగ్గరకి రావడం తో సినిమా రేంజ్ మారిపోయింది. సినిమా కి గాను పవర్ స్టార్ ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారని సమాచారం, ఇక మరో కీలక రోల్ కి చాలా మందిని అనుకున్నా చివరికి…
భాల్లలదేవుడు అయిన రానా దగ్గుబాటి ని సెలెక్ట్ చేశారు, అందుకు గాను 5 కోట్ల రెమ్యునరేషన్ రానా కి ఇస్తున్నారని సమాచారం. ఇక ఓవరాల్ గా సినిమా బడ్జెట్ 80 కోట్లు అని అంటున్నారు, అందులో ఎక్కువ భాగం రెమ్యునరేషన్ లకే వెళ్లబోతుండగా మిగిలిన అమౌంట్ లో సినిమా షూటింగ్ ను కేవలం 35 నుండి 40 రోజుల…
వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేసి సినిమా ను జూన్ లేదా జులై టైం కి ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలి అన్నది ప్లాన్ అని అంటున్నారు… రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో జరగనుంది, మరి పవర్ స్టార్ ఈ సినిమాతో ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి మరి…