Home న్యూస్ పవన్ కళ్యాణ్ బర్త్ డే….4 స్పెషల్ అప్ డేట్స్ తో రచ్చ రచ్చ!

పవన్ కళ్యాణ్ బర్త్ డే….4 స్పెషల్ అప్ డేట్స్ తో రచ్చ రచ్చ!

685
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50 వ పుట్టిన రోజు వేడుకలు సాలిడ్ గా జరుగుతున్నాయి. ఈ పుట్టిన రోజున పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ సినిమాల అప్ డేట్స్ అన్నీ కూడా రావడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మొత్తం మీద పుట్టిన రోజు టైం లో వచ్చిన అప్ డేట్స్ ని గమనిస్తే… ఉదయం 11 గంటల 16 నిమిషాలకు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రాగా, సాంగ్ కి రెస్పాన్స్…

సాలిడ్ గా వస్తూ ఉండగా యూట్యూబ్ లో టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. ఇక మధ్యాహ్నం 1 గంటా 20 నిమిషాలకు క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫాం చేశారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 29 న సినిమా రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేయగా, మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి క కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. యథాకాలం తథా వ్యవహారం అంటూ టాగ్ లైన్ తో ఒకపక్క గన్ మరో పక్క సిటీని చూపెట్టారు.

ఇక వీటి తర్వాత సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రీ లుక్ ని రివీల్ చేయగా బైక్ పైన పవన్ గన్ తో కూర్చున్న సగం స్టిల్ ను వదిలారు. అది కూడా బాగానే ఇంప్రెస్ చేసింది. మొత్తం మీద పుట్టిన రోజున రిలీజ్ చేసిన అప్ కమింగ్ సినిమాల అప్ డేట్స్ అన్నీ కూడా…

యూనిక్ గా ఉండటం విశేషం…. ఇక భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా ని ఊపెస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమాతో పవర్ స్టార్ ఏ రేంజ్ రచ్చ చేస్తారో చూడాలి. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ కి మరోసారి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here