T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

మహేష్ రికార్డ్ బ్రేక్ చేసిన పవన్…న్యూ బెంచ్ మార్క్ ఇదే!!

 



సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తమ హీరోల సినిమాల గురించి బర్త్ డే ల గురించి ట్రెండ్ చేయడం కామన్ అనే చెప్పాలి, సౌత్ లో ఒకప్పుడు తమిళ్ వాళ్ళది డామినేషన్ ఉండేది కానీ రీసెంట్ టైం లో తెలుగు స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియా రికార్డ్ ల విషయం లో సీరియస్ గా తీసుకుని సరికొత్త రికార్డులతో సినిమాల ఫస్ట్ లుక్స్ తో పాటు హీరోల పుట్టిన రోజు ట్రెండ్ లో….

సంచలన రికార్డులను నమోదు చేస్తున్నారు, హీరోల పుట్టిన రోజులు మారుతున్న కొద్ది ఈ రికార్డులు కూడా మారుతూ వస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు ఆగస్ట్ 9 న జరగగా దానికన్నా ముందు అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ ఒకటి జరిగింది.

కామన్ డి పి(CDP) ని రిలీజ్ చేస్తూ చేసే ఈ ట్రెండ్ లో మహేష్ ఫ్యాన్స్ ఏకంగా 2 మిలియన్ ట్వీట్స్ ని 24 గంటల్లో సాధించి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశారు, కాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 ఉండగా దానికన్నా ముందు కామన్ డి పి ని రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

ఇక సోషల్ మీడియాలో 24 గంటల్లో ఏకంగా 2.2 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ తో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్..ఒకసారి టాప్ 5 బిగ్గెస్ట్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లను గమనిస్తే..
1. #PawanKalyanBirthdayCDP-2.2M
2. #SuperstarMaheshBdayCDP – 2M
3. #SuriyaBirthdayCDP – 1.1M
4. #JANASENANIBirthdayCDP – 1M
5. #ThalapathyBfayCDP – 730.2K
6. #SSMBBirthdayCDP2K18 – 358K

వీటి వల్ల ఎవరికీ పెద్దగా ఉపయోగం లేదు కానీ ఫ్యాన్స్ తమ అభిమానం చూపడానికి ఇది ఫాలో అవుతూ ఉంటారు… కాగా ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రికార్డ్ ను పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేయగా తర్వాత ప్రభాస్ పుట్టిన రోజు ట్రెండ్ త్వరలో ఉంది, మరి ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE