టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత పూర్తిగా రాజకీయాలకే టైం కేటాయించినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఒకటి తర్వాత ఒకటి భారీ లెవల్ లో సినిమాలను కమిట్ అవుతూ వెళుతున్న పవన్ కళ్యాణ్ ముందుగా కమిట్ అయిన సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్. కాగా ఈ సినిమా కి గాను పవర్ స్టార్ భారీ లెవల్ లో…
తక్కువ రోజులే 40 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని అలాగే సినిమా సాధించే ప్రాఫిట్స్ లో 10% ప్రాఫిట్ షేర్ ని తీసుకోబోతున్నారని సినిమా మొదలు అయినప్పుడే వార్తలు శిఖారు చేశాయి. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేది.
కానీ పరిస్థితుల ప్రభావం వలన లేట్ అయిన సినిమా మరింత ఆలస్యం అవుతూ రావడం తో మే టైం లో తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్ల మేర పవన్ తగ్గించుకున్నారు అనే టాక్ రాగా… మే నుండి ఇప్పటి వరకు కూడా షూట్ డిలే అవ్వడం, రీసెంట్ గా తను లేకుండా మిగిలిన క్రూ తో…
షూటింగ్ మొదలు అవ్వగా ఇంత ఆలస్యం అయిందని తనతో చెప్పడం తో తన రెమ్యునరేషన్ 40 కోట్ల నుండి 30 కోట్లకి తగ్గించుకున్నాడట పవర్ స్టార్. దాంతో యూనిట్ హ్యాప్పీగా ఉండగా, ప్రాఫిట్ వస్తే అప్పుడు 10-15% షేర్ తీసుకుంటానని చెప్పడం తో సరే అన్నారని ట్రేడ్ లో గత కొన్ని రోజులుగా టాక్ వస్తుంది. అలా చూసుకున్నా కానీ…
ఒక సినిమాకి దాదాపుగా అందరూ హీరోలు డైరెక్ట్ గా ఈ రేంజ్ రెమ్యునరేషన్ కాకుండా 20-25 కోట్ల డైరెక్ట్ రెమ్యూనరేషన్, దాంతో పాటు శాటిలైట్ డిజిటల్ రైట్స్, లేదా ప్రాఫిట్ లో షేర్ ని రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నారు. పవన్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నా కానీ 30 కోట్ల డైరెక్ట్ రెమ్యునరేషన్ అందుకోవడం రికార్డే అని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ వచ్చే నెల ఎండ్ లో జాయిన్ కాబోతున్నారట.