Home న్యూస్ రాజమౌళి డైరెక్షన్ లో పవర్ స్టార్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఇదే!

రాజమౌళి డైరెక్షన్ లో పవర్ స్టార్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఇదే!

3245
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కొట్టాడు ఫ్లాఫ్స్ అందుకున్నాడు… కానీ పవర్ స్టార్ క్రేజ్ కి ఏమాత్రం అడ్డంకి రాలేదు సరికదా ఇంకా క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. తన కెరీర్ లో పవర్ స్టార్ చాలా సినిమాలనే మిస్ చేసుకోవాల్సి వచ్చింది. పూరీ రవితేజ కాంబో లో వచ్చిన సినిమాలు అన్నీ ముందు పవన్ దగ్గరికి వెళ్లినవే. పోకిరి సినిమా కానీ అతడు సినిమా కానీ…

ముందు పవన్ దగ్గరకి వెళ్ళడం ఎదో ఒక కారణం వలన పవన్ నో చెప్పడం జరిగింది. ఇదే టైం లో టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి తో పవర్ స్టార్ మూవీ కూడా ఎప్పుడో పడాల్సింది కానీ పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ ని కొన్ని కారణాల వలన…

నో చెప్పాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ వెబ్ ఇంటర్వ్యూ లో తెలియజేశారు. పవర్ స్టార్ తో రాజమౌళి మూవీ ఎప్పుడో 2005 టైం లోనే అనుకున్నామని, పవన్ ని దృష్టి లో పెట్టుకునే విక్రమార్కుడు కథని చాలా వరకు సిద్ధం చేసి…

ముందు పవన్ కళ్యాణ్ కి వినిపించామని కానీ అప్పుడు సినిమాల నుండి కొంచం బ్రేక్ తీసుకుని రెస్ట్ తర్వాత కొత్త సినిమాలు చేయడానికి పవన్ గ్యాప్ అడగడం తో కథని కొంచం మార్చి రవితేజ కి సూట్ అయ్యేలా మార్పులు చేశామని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. రవితేజ కెరీర్ లో ఆ టైం కి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ సినిమా…

ఒకవేళ పవన్ కళ్యాణ్ కి పడి ఉంటే ఆ టైం లో ఎన్నో అద్బుతాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించి ఉండేదేమో…. కానీ ఆ సినిమాను అనుకోకుండా మిస్ చేసుకున్న పవన్ కళ్యాణ్ జక్కన్న డైరెక్షన్ లో మూవీ ని మిస్ చేసుకున్నాడు. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకసారి వీళ్ళ కాంబో లో సినిమా పడితే చూడాలి అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here