Home న్యూస్ సడెన్ షాకిచ్చిన పవర్ స్టార్ రాంపేజ్…..ఇక రచ్చ రచ్చ ఖాయం!!

సడెన్ షాకిచ్చిన పవర్ స్టార్ రాంపేజ్…..ఇక రచ్చ రచ్చ ఖాయం!!

1394
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమా తో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఒక ఎక్స్ టెండెడ్ క్యామియో మూవీ తో ఓ పక్కా కమర్షియల్ మూవీ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసిన పవర్ స్టార్ మ్యానియా తో సినిమా ఇక బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది అనుకున్నా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ అండ్…

ఆంధ్రాలో టికెట్ రేట్ల గొడవ వలన సినిమా పరుగును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. అయినా కానీ పవర్ స్టార్ మ్యానియా సంచలనం సృష్టించింది. వరుస పెట్టి సినిమాలను కమిట్ అయిన పవర్ స్టార్ నుండి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సినిమాల్లో…

పవన్ కళ్యాణ్ రానా ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ ఈ ఇయర్ సెప్టెంబర్లో లో రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన సినిమా రిలీజ్ ను ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అఫీషియల్ గా కన్ఫాం చేశారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…

వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుందని సమాచారం. సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా రీసెంట్ గా సినిమా బాలెన్స్ షూటింగ్ ను యూనిట్ మొదలు పెట్టగా సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు రానా ల లుక్స్ ని రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ రోల్ పేరు కూడా రివీల్ చేయగా క్యారెక్టర్ పేరు ను భీంలా నాయక్ గా పెట్టారు.

గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ పోలిస్ గెటప్ లో చూడటం మళ్ళీ ఈ సినిమా తోనే జరగడం తో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తుండగా సినిమా హరిహర వీర మల్లు ప్లేస్ లో సంక్రాంతికి సందడి చేయడం కన్ఫాం అవ్వడం తో అప్పుడు బాక్స్ ఆఫీస్ ఊచకోత మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here