టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ హీరోలలో ముందు నిలిచే హీరో అని చెప్పాలి. సినిమాల హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎప్పటికీ రికార్డు లెవల్ లో ఉంటూ వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన…
పవర్ స్టార్ ఈ సినిమా తో టాలీవుడ్ లో వన్ ఆఫ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ని తీసుకున్న హీరోలలో ముందు నిలిచాడని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా 65 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందగా పవన్ కళ్యాణ్ కి రెమ్యునరేషన్ పరంగా 45 కోట్ల అమౌంట్ ఇచ్చారని టాక్ రాగా…
సినిమా టోటల్ బిజినెస్ లో తర్వాత ప్రాఫిట్ షేర్ ఉంటుందని చెప్పారట. సినిమా 65 కోట్ల బడ్జెట్ లో రూపొందగా టోటల్ బిజినెస్ 123 కోట్లు పలకగా అందులో డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కింద 32 కోట్ల రేటు సొంతం అవ్వగా ఇప్పుడు సినిమా కొంచం త్వరగా డిజిటల్ రిలీజ్ కానుండగా రేటు పెరిగి…
మొత్తం మీద 42 కోట్ల దాకా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ పెరిగిందని అంటున్నారు. ముందు 50 రోజుల క్లాజ్ ఉండగా ఇప్పుడు అది తగ్గి 30 రోజులకు మార్చారు అంటున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉండగా టోటల్ బిజినెస్ లెక్క ఇప్పుడు 132 కోట్లు అవ్వగా హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ కూడా జరుగుతుందని అది కూడా కలిపితే రఫ్ గా 150 కోట్ల ఓవరాల్ బిజినెస్ ను ఈ సినిమా…
సొంతం చేసుకుంటుందని అంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ కి ప్రాఫిట్ షేర్ కింద మరో 20 కోట్లు వెల్లబోతున్నాయని అంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో… దాంతో ఒక్క సినిమాకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 65 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని సొంతం చేసుకోబోతున్నాడని చెప్పొచ్చు. ఇంత ఇచ్చినా నిర్మాత దిల్ రాజు కి ఈ సినిమా అల్టిమేట్ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు.