Home గాసిప్స్ బ్రేకింగ్ న్యూస్: వకీల్ సాబ్ న్యూ రిలీజ్ డేట్ ఇదే!!

బ్రేకింగ్ న్యూస్: వకీల్ సాబ్ న్యూ రిలీజ్ డేట్ ఇదే!!

439
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచిపోయింది… 2018 సంక్రాంతి రేసు లో ఎంటర్ అయిన పవర్ స్టార్ సోలోగా భారీ అంచనాల నడుమ వచ్చినా కానీ టాక్ ఓ రేంజ్ లో నెగటివ్ గా రావడం తో టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీ ని తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా రాజకీయాలలోనే బిజీగా ఉన్న పవన్ రీసెంట్ గా….

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలను కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ముందుగా చేస్తున్న సినిమా అయిన హిందీ పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈ పాటికే రిలీజ్ అయ్యి నెలకు పైగా…

అయ్యేది కానీ కరోనా ఎఫెక్ట్ వలన అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవ్వగా ఆ లిస్టులో ఈ సినిమా కూడా ఉండగా ఎప్పుడు రిలీజ్ అన్నది క్లారిటీ లేకుండా పోయింది. ఈ ఏడాది అసలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అన్న డౌట్ కూడా అందరిలోనూ ఉంది.

దాంతో పాటే రిలీజ్ అయినా కానీ జనాలు వస్తారో రారో అన్న అనుమానం తో వచ్చే ఏడాది సంక్రాంతి కి కొత్త రిలీజ్ డేట్ గా అనుకున్న చిరు ఆచార్య ప్లేస్ లో ఇప్పుడు పవర్ స్టార్ వకీల్ సాబ్ ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది.

ఏ సంక్రాంతి కి అయితే లాస్ట్ మూవీ చేశాడో మళ్ళీ అదే సంక్రాంతి కి తిరిగి బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇది నిజం అయితే ఈ సారి కంటెంట్ ఉన్న సినిమా తో వస్తున్నా నేపధ్యంలో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here