Home గాసిప్స్ డిలే అయిందని స్పీడ్ పెంచనున్న పవర్ స్టార్…2 సినిమాలు ఇక జట్ స్పీడ్ తో!

డిలే అయిందని స్పీడ్ పెంచనున్న పవర్ స్టార్…2 సినిమాలు ఇక జట్ స్పీడ్ తో!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి చాల టైం అవుతుంది, సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకున్న పవర్ స్టార్ రేంజ్ సినిమా పడి చాలా సమయమే అవుతుంది, అజ్ఞాతవాసి సినిమా తర్వాత టోటల్ సమయం రాజకీయాల కే పరిమితం చేయాలి అనుకున్నా వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ వరుస పెట్టి సినిమా లు కమిట్ అయిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉండేది కానీ లాక్ డౌన్ వలన మిగిలిన సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక జూన్ 10 నుండి సినిమాల షూటింగ్ మళ్ళీ చేసుకోవచ్చని…

రీసెంట్ గా ప్రభుత్వం కన్ఫాం చేయడం తో పవన్ కళ్యాణ్ డిలే చేయకుండా తన అప్ కమింగ్ మూవీస్ షూటింగ్స్ ని మొదలు పెట్టె పనిలో ఉన్నారని సమాచారం. జూన్ 3 వ వారం లో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అడుగు పెట్ట బోతున్నారట పవర్ స్టార్.

ఇక ఆ షూటింగ్ లో మొదటగా లాక్ డౌన్ కన్నా ముందు ప్లాన్ చేసుకున్న ఫైట్ సీన్ ని తీయడం తో సినిమా షూటింగ్ మొదలు అవుతుందట. ఇక తను చేస్తున్న పాన్ ఇండియా మూవీ క్రిష్ డైరెక్షన్ లో ఉండగా ఈ సినిమా కూడా మొదలు పెట్టబోతున్నాదట పవర్ స్టార్…. ఈ సినిమా షూటింగ్ జులై మొదటి వారం లో…

తిరిగి మొదలు అవుతుందని సమాచారం. మొత్తం మీద లాక్ డౌన్ వలన డిలే అవ్వడం తో ఇప్పుడు స్పీడ్ పెంచి అప్ కమింగ్ మూవీస్ ని మరింత జోరుగా కంప్లీట్ చేయాలని పవర్ స్టార్ భావిస్తున్నాడు. ఇక వకీల్ సాబ్ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here