టాలీవుడ్ హీరోలలో తక్కువ వర్కింగ్ డేస్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్న హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరి కన్నా ముందు నిలిచాడు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో కొన్ని రీమేక్ లు ఉన్నా కానీ వాటికి కూడా రికార్డ్ లెవల్ లో బిజినెస్ లు జరుగుతూ ఉండటంతో పవన్ తో సినిమా అంటే ఎంతైనా పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉండటం విశేషం. ఆ రేంజ్ లో క్రేజ్ ని…
సొంతం చేసుకున్నా కానీ పాలిటిక్స్ తో ప్రజలకు సేవ చేయాలనీ తన వంతుగా కృషి చేస్తున్న పవర్ స్టార్ రీసెంట్ గా జరిగిన పొలిటికల్ మీటింగ్ లో అనేక విషయాల మీద మాట్లాడుతూ తన సినిమాల విషయాన్నీ కూడా చెబుతూ తాను ఒక రోజుకి ఇప్పుడు…
2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నానని, ఆ స్టేజ్ లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎదో ఒక సేవ చేయలాని ట్రై చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు అన్నీ కూడా 25-30 రోజుల కాల్ షీట్స్ ఇస్తున్న పవర్ స్టార్ 50-60 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని అందుకుంటున్నాడు ఇప్పుడు…
ఈ లెక్కన రోజుకి అటూ ఇటూగా 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు అని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు అన్నీ సెట్స్ మీదే ఉండగా వాటిలో అన్నీ అనుకున్నట్లు జరిగితే సాయి ధరం తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది…