Home న్యూస్ 8-10 పేజీల డైలాగ్స్…సింగిల్ టేక్ పవర్ స్టార్ రాంపేజ్ ఇదీ!!

8-10 పేజీల డైలాగ్స్…సింగిల్ టేక్ పవర్ స్టార్ రాంపేజ్ ఇదీ!!

0

టాలీవుడ్ ప్రజెంట్ టాప్ హీరోలలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో ముందు నిలిచే హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ తన మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ తోనే అభిమానులను ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేవారు. కానీ అదే టైం లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ పై ఎప్పుడూ విమర్శలు లేవు కానీ ఇతర హీరోలలో….

Vakeel Saab 6 Days Total World Wide Collections

బెస్ట్ పెర్ఫార్మెన్స్ రోల్స్ తక్కువగానే పడ్డాయి, అత్తారింటికి దారేది లో క్లైమాక్స్ సీన్ ఇలా కొన్ని చోట్ల మాత్రమే పవన్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. కానీ పెర్ఫార్మెన్స్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసిన సినిమాగా లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ని చెప్పుకోవచ్చు.

Vakeel Saab 5 Days Total World Wide Collections

ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లేదా ఇదే బెస్ట్ అనిపించే పెర్ఫార్మెన్స్ వకీల్ సాబ్ లో చేశారు అని మెచ్చుకున్నారు. ఇక ఇదే టైం లో సినిమా లో పవన్ కళ్యాణ్ కోర్టు సీన్స్ లో సింగిల్ టేక్ లో పేజీలకి పేజీలు…

Vakeel Saab 4 Days Total World Wide Collections

డైలాగ్స్ అన్నీ కూడా సింగిల్ టేక్ లో చెప్పే వారని సినిమా కి పని చేసిన నటుడు శివ రీసెంట్ గా ఒక ఇంటర్వూలో తెలియజేయడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ ని మరింత ఖుషీ అయ్యేలా చేస్తుంది. కోర్టు సీన్స్ లో భాగంగా కొన్ని రోజు నాన్ స్టాప్ గా 8-10 పేజీల లెంత్ ఉన్న డైలాగ్స్ ని…

Vakeel Saab 8 Days Total World Wide Collections

8 కెమరాలు స్టార్ట్ అయిన వెంటనే నాన్ స్టాప్ గా చెప్పేవారు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు శివ… ఎడిటింగ్ కట్స్ వల్ల అవి సింగిల్ టేక్ షాట్స్ అని తెలియలేదు కానీ అలా చాలా సార్లు సింగిల్ టేక్ లో పవన్ డైలాగ్స్ చెబుతుంటే క్రూ మొత్తం చప్పట్లు కొట్టే వాళ్ళు అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం సినిమా రిలీజ్ టైం కి తెలిసి ఉంటే ఫ్యాన్స్ రచ్చ మరింత ఎక్కువగా ఉండి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vakeel Saab 9 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here