కరోనా ఎఫెక్ట్ వలన అన్ని సినిమాల పై ఇంపాక్ట్ గట్టిగా పడింది, కొన్ని చిన్నా చితకా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని నమ్ముకోగా చాలా సినిమాలు ఇప్పటికీ డైరెక్ట్ రిలీజ్ కి ఓకే చెప్పాలా లేదా అన్న డౌట్ లోనే ఉన్నాయి. రీసెంట్ గా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే మిగిలిన సినిమాలకు చెప్పిందే రేటు అవుతుందని అన్ని OTT యాప్స్ అన్ని పెద్ద సినిమాలకు భారీ ఆఫర్స్ ఇవ్వగా…
ఎట్టకేలకు నాని వి ది మూవీ కి బేరం కుదరగా… ఇప్పుడు అసలు సిసలు ఆట మొదలు అయ్యింది, వి మూవీ ఓకే అవ్వడం తో ఇతర సినిమాలు చర్చలో ఉన్నవి కూడా డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం అవ్వగా వాటికి రేట్లు తక్కువ చేస్తూ వస్తున్నాయి.
చాలా సినిమా ల రేట్లు తగ్గగా…. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కి మాత్రం రేటు సాలిడ్ గా పెంచారు. సినిమా రీమేక్ అని తెలిసినా… పవర్ రోల్ లిమిటెడ్ గా ఉంటుంది అని తెలిసినా కానీ ఇది వరకు సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం అక్షరాలా 75 కోట్ల రేంజ్ బిజినెస్ ఆఫర్ చేశారు.
కానీ అప్పుడు నిర్మాతలు నో చెప్పగా… మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అండ్ సినిమా క్రేజ్ ని చూసి మిగిలిన సినిమాల మాదిరిగా రేటు తగ్గిస్తారు అనుకున్నా మరింత పెంచి ఏకంగా 80 కోట్ల రేంజ్ రేటు ని ఆఫర్ చేశారట డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం.
కానీ యూనిట్ మాత్రం అప్పుడు ఆ రేటు కి ఇప్పుడు ఈ రేటు కి కూడా నో చెప్పారని, ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ ని సొంతం చేసుకుంటుందని మళ్ళీ కన్ఫాం చేశారు. సినిమా బాలెన్స్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతుండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా సంక్రాంతికి లేదా సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం…