టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమా వకీల్ సాబ్ అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. కాగా టీసర్ కి రెస్పాన్స్ అద్బుతంగా దక్కగా యూట్యూబ్ రికార్డుల వేట ని ఫ్యాన్స్ సాలిడ్ గా స్టార్ట్ చేశారు. మొదటి 2 గంటల టైం లోనే ఏకంగా 4 మిలియన్స్ కి పైగా రియల్ టైం వ్యూస్ వచ్చాయి అని యూనిట్ పోస్టర్స్ తో అనౌన్స్ మెంట్ కూడా చేసింది.
ఇక యూట్యూబ్ లో లైక్స్ పరంగా కూడా ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ నుండి 5 లక్షల లైక్స్ వరకు కూడా ఆల్ రెడీ టాప్ లో ఉన్న టీసర్ కన్నా కేవలం 1 నిమిషం గ్యాప్ లో నిలుస్తూ టగ్ ఆఫ్ వార్ ఇచ్చిన వకీల్ సాబ్ అఫీషియల్ టీసర్ 5 లక్షల లైక్స్ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయింది.
6 లక్షల లైక్స్ ని అందుకోవాడానికి టైం పట్టగా తర్వాత 7 లక్షల లైక్స్ కి మరింత లేట్ అయింది, యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ కూడా తగ్గగా మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి సినిమా కి 8.57 మిలియన్స్ వ్యూస్ అండ్ 776.9K లైక్స్ దక్కాయి.
ఇవి కూడా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రికార్డులలో ఒకటే అయినా మొత్తం మీద కొత్త రికార్డులు అందుకోవడంలో మిస్ అయ్యింది టీసర్.. ఒకసారి టాప్ 5 లైక్స్ అండ్ వ్యూస్ ని సాధించిన టీసర్లను గమనిస్తే…
👉#SarileruNeekevvaru—- 14.64 Mil+
👉#RamaRajuForBheem – 14.14 Mil
👉#Saaho —12.94 Mil
👉#Maharshi —11.14Mil
👉#BharatAneNenu- 8.67Mil
👉#VakeelSaab- 8.57Mil***
హైయెస్ట్ లైక్స్ ని సాధించిన టీసర్ లు ఇవి…
👉#RamarajuForBheem – 940.3K Likes
👉#VakeelSaab – 776.9K****
👉#BheemForRamaraju – 494K
👉#Saaho – 455K
👉#Agnyaathavaasi-412K
👉#AlaVaikunthapurramuloo – 387K
ఇవి మొత్తం మీద టాప్ లో ఉన్న టీసర్ లు…
యూట్యూబ్ రికార్డుల విషయం లో కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్నా అవి యూట్యూబ్ కొత్త అప్ డేట్ కారణంగా ఫ్యాన్స్ మిస్ చేసుకున్నారు అని అంటున్నారు. ఇక టీసర్ లో పవన్ యాటిట్యూడ్ అండ్ స్క్రీన్ ప్రజన్స్ కి రెస్పాన్స్ సాలిడ్ గా ఉంది. ఇక సమ్మర్ కి సిద్ధం అవుతున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల విషయం లో మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలని కోరుకుందాం…