బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన గేమ్ చేంజర్(Game Changer Movie) సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యి భారీ నష్టాలను సొంతం చేసుకుని ఆల్ టైం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనిపించకుండా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు భారీ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ అయిన పెద్ది(Peddi Movie) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ షూటింగ్ లో ఉండగానే సినిమా మీద…
ఆడియన్స్ లో అంచనాలు ఓ లెవల్ లో ఉండగా బిజినెస్ పరంగా ఇప్పటి నుండే మాస్ రచ్చ చేస్తున్న ఈ సినిమాకి డిజిటల్ రైట్స్ కింద సెన్సేషనల్ రేటు సొంతం అయ్యిందని సమాచారం….ఎపిక్ డిసాస్టర్ గేమ్ చేంజర్ తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో..
రూపొందుతున్న పెద్ది సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు మమ్మోత్ రేటు చెల్లించి దక్కించుకున్నారు….తెలుగు తో పాటు హిందీ అండ్ ఇతర భాషల డబ్ వర్షన్ లు అన్నీ కలిపి ఒక్క డిజిటల్ రైట్స్ కిందే సినిమా కి ఏకంగా 105 కోట్ల రేంజ్ లో…
మమ్మోత్ బిజినెస్ జరిగిందని సమచారం, సినిమా బడ్జెట్ లో చాలా మొత్తం ఇక్కడ నుండే రికవరీ అవ్వడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…ఇక శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ కూడా సాలిడ్ రేట్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఈ సినిమాతో…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసాస్టర్ రిజల్ట్ ను మరిపించి ఊహకందని కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. కంటెంట్ పరంగా సినిమా ఎక్స్ లెంట్ గా ఉంటుందని చెబుతూ ఉండగా అది నిజం అయితే మరోసారి రామ్ చరణ్ రికార్డుల రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.