Home న్యూస్ పెళ్లిసందD టోటల్ బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

పెళ్లిసందD టోటల్ బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

2508
0

కే రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత సమర్పణలో తెరకెక్కిన సినిమా పెళ్లిసందD… ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీ పెళ్ళిసందడి సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా దసరా బరిలో నిలిచిన ఈ సినిమా ఒకే ఒక్క ఫ్యామిలీ లవ్ స్టొరీ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ సొంతం చేసుకుంటుంది అన్న నమ్మకంతో సినిమాను గ్రాండ్ గానే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇక సినిమా కి టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా పోటి లో కూడా మంచి బిజినెస్ సొంతం అయ్యింది. సినిమాను నైజాం ఏరియాలో 2 కోట్ల రేటు కి కొనగా సీడెడ్ ఏరియాలో 1.3 కోట్ల రేటుని సొంతం చేసుకుంది. ఇక ఆంధ్ర రీజన్ లో సినిమా కి…

రీవైజ్ చేసిన బిజినెస్ 3.1 కోట్లు పలకగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సినిమా కి 6.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అయ్యింది. ఇక సినిమా కి మిగిలిన చోట్ల అన్నీ కలిపి 7 కోట్ల దాకా బిజినెస్ సొంతం అయినట్లు సమాచారం. దాంతో సినిమా ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పోటి లో ఈ రేంజ్ బిజినెస్ ను రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి కానీ ఒకప్పటి పెళ్ళిసందడి ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఇప్పుడు కూడా…

ఇలాంటి రిజల్ట్ రిపీట్ అవుతుంది అన్న నమ్మకంతో టీం ఉండగా కీరవాణి సంగీతం, రాఘవేంద్రరావు మార్క్ సీన్స్ కొన్ని ఆల్ రెడీ సినిమా పై కొంత బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక టాక్ పాజిటివ్ గా వస్తే ఈ బిజినెస్ ను సినిమా రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here