Home న్యూస్ పెంగ్విన్ 30….BB3రోర్ 12…దుమ్ము లేపాయి!!

పెంగ్విన్ 30….BB3రోర్ 12…దుమ్ము లేపాయి!!

1164
0

లాక్ డౌన్ టైం లో కొత్త సినిమా లకు సంభందించిన అప్ డేట్స్ చాలా తక్కువ సమయాల్లోనే వచ్చాయి. లాక్ డౌన్ స్టార్ అయిన టైం లో ఆర్ ఆర్ ఆర్ సినిమా లుక్ తో పాటు ఇంట్రో టీసర్ కూడా రిలీజ్ అవ్వగా తర్వాత తెలుగు సినిమాల పరంగా పెద్దగా నోటెబుల్ మూవీస్ టీసర్లు కానీ ట్రైలర్లు కానీ రిలీజ్ అవ్వలేదు. మళ్ళీ జూన్ నెలలో 2 సినిమాల టీసర్లు ట్రైలర్ రిలీజ్ అయ్యాయి.

అవే బాలయ్య బోయపాటి ల BB3 మూవీ మరోటి కీర్తి సురేష్ నటించిన మల్టీ లాంగ్వేజ్ మూవీ పెంగ్విన్. కాగా ఈ రెండు సినిమాల టీసర్స్ అండ్ ట్రైలర్ కి యూట్యూబ్ లో అద్బుతమైన వ్యూస్ అండ్ రీచ్ దక్కగా… పెంగ్విన్ ట్రైలర్ అయితే టాలీవుడ్ బిగ్ మూవీస్…

ట్రైలర్ రికార్డులు సైతం బ్రేక్ చేసి దుమ్ము దుమారం చేసింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని సినిమాకున్న క్రేజ్ ని నిరూపించుకోగా ఇప్పుడు ఓవరాల్ కౌంట్ 34 మిలియన్ వరకు ఉందని సమాచారం. ఈ సినిమా 19 న డిజిటల్ రిలీజ్ కాబోతుంది.

ఇక బాలయ్య బోయపాటి సినిమా టీసర్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి వారం రోజులు కావొస్తున్న యూట్యూబ్ లో ఇంకా ట్రెండ్ అవుతుండటం విశేషం, ఇక టీసర్ కి ఓవరాల్ గా ఇప్పటి వరకు 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ దక్కాయని యూనిట్ అప్ డేట్ చేసింది. టీసర్ గ్లిమ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండటం మాత్రం కచ్చితంగా విశేషం అనే చెప్పాలి.

మొత్తం మీద ఈ నెలలో వచ్చిన టీసర్ అండ్ ట్రైలర్స్ లో ఈ రెండు సినిమాలు మాత్రం ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ని క్రియేట్ చేశాయి అని చెప్పాలి. ఇక లాక్ డౌన్ ముగిసింది కాబట్టి త్వరలోనే మరిన్ని సినిమాల టీసర్ లు ట్రైలర్ లు సినిమా లు కూడా రిలీజ్ ఒక్కొటిగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here