Home న్యూస్ పెంగ్విన్ రివ్యూ-రేటింగ్….మళ్ళీ షాక్ కొద్దిందిగా!!

పెంగ్విన్ రివ్యూ-రేటింగ్….మళ్ళీ షాక్ కొద్దిందిగా!!

2260
0

మహానటి తో నటిగా అద్బుతమైన పేరు ప్రతిష్టలను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత కమిట్ అయిన కొత్త సినిమాలు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కాగా అందులో తెలుగు తమిళ్ మలయాళం లో రూపొందిన పెంగ్విన్ సినిమా నేడు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. కాగా సినిమా ట్రైలర్ పెంచిన అంచనాలను సినిమా రిలీజ్ అయ్యాక అందుకుందా లేదా అన్న విశేషాలను తెలుసు కుందాం పదండీ…

కథ విషయానికి వస్తే ఆరేళ్ళ క్రితం తప్పిపోయిన కొడుకుని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన కీర్తి సురేష్ వెతుకుతూ ఉంటుంది, కొడుకుని కిడ్నాప్ చేశారని, తనని ఎలాగైనా పట్టుకోవాలని అహర్నిశలు ప్రయత్నిస్తుంది, చార్లీ చాప్లిన్ గెటప్ లో వ్యక్తీ ఈ పని చేయడం తో తనని వెతికే పనిలో ఉంటారు.

ఆ వ్యక్తీ ఎవరు ఎందుకని కిడ్నాప్ చేశాడు, అసలు దొరికాడా లేదా అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సింపుల్ స్టొరీ లైన్ ని కొన్ని పాత్రల చుట్టూ మాత్రమె కథని అల్లుకుని డైరెక్టర్ ఈ సినిమా ను తీశాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఫోకస్ మొత్తం కేవలం కీర్తి సురేష్ మీదే ఉంటుంది.

లుక్స్ మారిపోయి అలవాటు పడటానికి కొద్దిగా టైం పట్టినా కీర్తి సురేష్ నటనతో ఆదరగోట్టేసింది. తన హవాభావాలు, పెర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్ లో పీక్స్ లో ఉండగా ఓవరాల్ గా సినిమా మొత్తం తన భుజాన మోసింది. ఇక మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. రఘు పాత్ర చేసిన లింగా కూడా మెప్పించాడు.

సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని సీన్స్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యేలా చేసింది బ్యాగ్రౌండ్ స్కోర్, ఇక విజువల్స్ కూడా టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మొదటి 45 నిమిషాల వరకు ఉత్కంట గా ఉన్నప్పటికీ తర్వాత గాడి తప్పింది.

ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ మొత్తం నీరసంగా సాగగా క్లైమాక్స్ ని చాలా సింపుల్ గా తేల్చేశారు. దాంతో ఫస్టాఫ్ చాలా వరకు ఉన్న గుడ్ ఇంప్రెషన్ సినిమా చూసిన తర్వాత ఇంతేనా సినిమా అనిపిస్తుంది. డైరెక్షన్ పరంగా ఈశ్వర్ కార్తిక్ ఒక్క కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ వరకు ఫుల్ మార్కులు కొట్టేసినా…

సెకెండ్ ఆఫ్ విషయం లో చాలా సాదాసీదా కథని అందించి థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఇంప్రెషన్ మారేలా చేశాడు. సెకెండ్ ఆఫ్ కథ అండ్ క్లైమాక్స్ ని మరింత బాగా రాసుకుని విలన్ ని కూడా మరింత బాగా ఎస్టబ్లేష్ చేయాల్సింది. కానీ అది మిస్ అయ్యి సినిమా అంచనాలను అందుకోవడం లో విఫలం అయింది.

ఇలాంటి సైకో సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కావాల్సింది, ఉత్కంట కలిగించే స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, విలనిజం, స్ట్రాంగ్ విలన్ ఫ్లాష్ బ్యాక్ అండ్ చివర్లో ప్రధాన పాత్ర ఎలా విలన్ కథ ముగించింది అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఇందులో చాలా కొన్ని అంశాలు మాత్రమె మెప్పించే విధంగా ఉండగా మిగిలినవన్నీ అంచనాలను అందుకోలేదు.

మొత్తం మీద కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ కోసం మొదటి 40 నిమిషాల సినిమా కోసం సినిమా ను ఒకసారి చూడొచ్చు. ట్రైలర్ చూసి రాక్షసుడు రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేస్తే భారీగా నిరాశ పరుస్తుంది ఈ సినిమా… మా రేటింగ్ 2.5/5…. మరో OTT రిలీజ్ కూడా అంచనాలను అందుకోలేక పోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here