కోలివుడ్ నాచురల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన విలక్షణ సినిమాల్లో పిజ్జా కూడా ఒకటి, ఆ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన పిజ్జా 2 సినిమా తమిళ్ లో 2013 లో రిలీజ్ అవ్వగా ఆ సినిమా తెలుగు డబ్బింగ్ జరగలేదు, ఇప్పుడు రిలీజ్ అయిన 7 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ఈ సినిమా ను శ్రేయాస్ యాప్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రీసెంట్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు.
మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే… తన ఫ్రెండ్స్ చేసే పనులకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హీరో ఇబ్బందుల్లో పడుతూ ఉంటాడు, మ్యూజిక్ టీచర్ అయిన హీరోయిన్ గాయత్రి తో హీరో కి పరిచయం ప్రేమగా మారుతుంది…
తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్ళ జీవితాల్లో ఊహించని మలుపులు వస్తాయి, అవి ఏంటి, వాటిని వీళ్ళు ఎలా పరీక్షరించారు అన్నది ఓవరాల్ గా సినిమా కథ. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా లో పెర్ఫార్మెన్స్ పరంగా ఉన్నది తక్కువ మందే అయినా కానీ అందరూ ఆకట్టుకున్నారు.
విజయ్ సేతుపతి నాచురల్ యాక్టింగ్ తో దుమ్ము లేపగా హీరోయిన్ గాయత్రి కూడా మెప్పిస్తుంది, మిగిలిన రోల్స్ బాగానే నటించగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది, చాలా సన్నివేశాలు బోర్ కొట్టించాయి, ఎడిటింగ్ షార్ప్ గా లేడనే చెప్పాలి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్…
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉండగా డైరెక్టర్ రంజిత్ జేయకోడి క్రైం థ్రిల్లర్ పాయింట్ ని కొన్ని పార్టులుగా బాగా చెప్పాడు కానీ ఓవరాల్ గా మాత్రం బిలో యావరేజ్ మార్కులే వేయించుకున్నాడు, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ మాత్రం బాగా తీశాడని చెప్పాలి. కానీ అవి తప్పితే మిగిలిన సీన్స్ లో ఎక్కువ శాతం…
ఫ్లాట్ నరేషన్ తో సీరియస్ టోన్ తో అలా వస్తూ పోతూ ఉంటాయి, చూస్తున్న ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేకపోయాయి. స్క్రీన్ ప్లే మరింత బాగా రాసుకుని ఉన్నా లేదా ఉన్న దాన్నే కొంత వరకు ఎడిటింగ్ షార్ప్ గా చేసినా సినిమా ఉన్నంతలో బాగానే మెప్పించి ఉండేది.
మొత్తం మీద ప్లస్ పాయింట్స్ లీడ్ యాక్టర్స్ ల పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అండ్ అక్కడక్కడా మెప్పించే కొన్ని సన్నివేశాలు… ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వీక్ నరేషన్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే వీక్ డైరెక్షన్ లు అని చెప్పాలి. మొత్తం మీద క్రైం థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి…
సినిమా కొద్ది వరకు మెప్పించే అవకాశం ఉంటుంది, ఇక రొటీన్ మూవీస్ చూసే వారికి సినిమా బోర్ కొడుతుంది, సినిమా 7 ఏళ్ల క్రితం మూవీ అయినా కానీ క్వాలిటీ బాగా ఉండటం తో ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది, కానీ అద్బుతం అయితే కాదనే చెప్పాలి, సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….