పాపం మంచు విష్ణు… బాక్స్ అఫీస్ దగ్గర హిట్ కొట్టి ఏళ్ళు అవుతూ ఉండగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తన లేటెస్ట్ మూవీ జిన్నా మూవీ ఉన్నంతలో పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించుకునే రేంజ్ లో టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కానీ జనాలు మాత్రం ఈ సినిమాను చూడటానికి థియేటర్స్ లో అడుగు పెట్టడం లేదు, పండగ వీకెండ్ లో పోటి లో వచ్చిన ఈ సినిమా…
కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుంది అనుకున్నా కానీ మొదటి రోజు నుండే నిరాశ కలిగించే కలెక్షన్స్ ని సాధించగా పోటి వలన స్లో స్టార్ట్ ను అందుకుంది, తర్వాత పుంజుకుంటుంది అనుకున్నా రెండో రోజు మూడో రోజు కూడా..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ని చూపించలేదు, ఓవర్సీస్ లో అయితే కలెక్షన్స్ మరింత దారుణంగా మారిపోగా… ఓవరాల్ గా సినిమా కి డీసెంట్ టాక్ ఉన్నా కానీ కలెక్షన్స్ మాత్రం అత్యంత నిరాశ జనకంగా ఉండటం విచారకం అనే చెప్పాలి…
బహుశా సినిమాను పోటిలో రిలీజ్ చేయడం భారీగా ఎదురుదెబ్బ కొట్టి ఉంటుంది అని చెప్పాలి. సోలో రిలీజ్ చేసి ఉంటే సినిమా కి వచ్చిన డీసెంట్ టాక్ వలన కొంచం బెటర్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది కానీ ఇప్పుడైతే మాత్రం భారీగానే దెబ్బకొట్టింది.