Home న్యూస్ పోట్టేల్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

పోట్టేల్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0
Pottel Movie Review and Rating
Pottel Movie Review and Rating

చిన్న సినిమానే అయినా కూడా రీసెంట్ టైంలో డీసెంట్ బజ్ ను సొంతం చేసుకున్న సినిమా పోట్టేల్(Pottel Movie Review and Rating) ట్రైలర్ ఆకట్టుకునేలా మెప్పించడంతో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా, సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే…

1970-80’s టైంలో మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ లో ఉన్న ఒక చిన్న ఊరులో పటేల్ వ్యవస్థ అలానే కొనసాగుతూ ఉండగా ఊరి ప్రజలను ఊరి పెద్ద అయిన అజయ్ మోసం చేస్తూ ఉంటాడు…ఈ విషయం తన దగ్గర పని చేసే హీరో కి తెలిసినా కూడా జనాలు ఆ మాటలు నమ్మరు…

ఇక ఊరిలో ప్రతీ 12 ఏళ్లకి ఒకసారి వచ్చే బాలమ్మ జాతరలో పోట్టేల్ ను బాలి ఇస్తారు…ఇక అజయ్ దగ్గర పని చేసే హీరో తన కూతురుని కూడా చదివించాలి అనుకుంటాడు కానీ ఈ విషయం తెలిసిన ఊరి పెద్ద అజయ్ ఏం చేశాడు…ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి అన్ని పాత్రల పరిచయాలు మెప్పించాగా తర్వాత హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ ఆ తర్వాత ప్రజెంట్ టైంలో కూతురు చదువు కోసం హీరో పడే కష్టాలతో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా సాగుతూ అక్కడక్కడా ఆసక్తి కరమైన సన్నివేశాలతో మెప్పించింది…

ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా మెప్పించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచేస్తుంది, సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా కూడా హీరో అండ్ ఫ్యామిలీ మీద ఊరి వాళ్ళు అందరూ వెంటపడటం, హీరోని ఇష్టం వచ్చినట్లు కొడుతూనే ఉండటంతో కొంచం వాయిలెన్స్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది…

ఆ వాయిలెన్స్ రిపీటివ్ గా అనిపించడం ఒక్కటి మేజర్ డ్రా బ్యాక్…ఇదొక్కటి ఆడియన్స్ తట్టుకోగలిగితే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి ఆకట్టుకున్న సినిమా డీసెంట్ ఎండింగ్ తో పర్వాలేదు ఓ డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పాలి.

పెర్ఫార్మెన్స్ పరంగా విలన్ రోలే చేసినా కూడా అజయ్ ఎక్స్ లెంట్ గా నటించి దుమ్ము లేపాడు…తన కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని చెప్పాలి. ఇక హీరోగా చేసిన యువచంద్ర హానెస్ట్ యాక్టింగ్ తో మెప్పించగా అనన్య కూడా ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు..

సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా మెప్పించింది…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ లో కొంచం ఎక్కువ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది..ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ను బాగానే ప్రజెంట్ చేసినా ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్…

వాయిలెన్స్ డోస్ మరీ ఎక్కువ చేయకుండా ఉండి ఉంటే సినిమా ఔట్ పుట్ ఇంకా చాలా బెటర్ గా ఉండేది అనిపించింది. అయినా కూడా రెగ్యులర్ మూవీస్ మధ్య కచ్చితంగా పోట్టేల్ మూవీ ప్రత్యేకంగా కనిపించడం అయితే ఖాయం…ఓవరాల్ గా పెద్దగా…

అంచనాలు ఏమి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ని కొంచం థ్రిల్, కొంచం ఆలోచించేలా చేసి, ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేసి….చదువు కోసం పడే కష్టాలను తెలియజేసి ఓవరాల్ గా ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది…మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here