Home న్యూస్ పవర్ ప్లే మూవీ రివ్యూ…ఏంటి సామి ఇది!!

పవర్ ప్లే మూవీ రివ్యూ…ఏంటి సామి ఇది!!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అయింది, హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న ఒరేయ్ బుజ్జిగా OTT లో హిట్ అవ్వగా ఆ డైరెక్టర్ తోనే చేసిన కొత్త సినిమా పవర్ ప్లే అసలు చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చేసింది, మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను గమనిస్తే… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…

తన తండ్రి గవర్నమెంట్ జాబ్ ని తండ్రి వాలంటరీ రిటైర్ మెంట్ తర్వాత దక్కించుకున్న హీరో, తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒక వారం ముందు ఒక ATM లో దొంగ డబ్బు రావడంతో అది తెలియక ఆ డబ్బు ఖర్చు పెడతారు, తర్వాత పోలీసులు పట్టుకోగా తన లైఫ్ మొత్తం మారిపోతుంది, మరి హీరో ఎలా ఈ పరిస్థితులను ఎదురుకున్నాడు అన్నది సినిమా కథ…

కథ పాయింట్ బాగానే ఉన్న, స్టొరీ లో అక్కడక్కడా మంచి ట్విస్ట్ లు ఉన్నా కానీ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తెరకెక్కించిన విధానం నీరసం కలిగిస్తుంది, రెండు గంటల లోపే లెంత్ ఉన్న సినిమానే అయినా బోర్ కొట్టిస్తుంది సినిమా.. ఇక ఎనర్జిటిక్ రోల్స్ తో ఎక్కువగా మెప్పించిన రాజ్ తరుణ్ డల్ ఫేస్ తో నీరసమైన యాక్టింగ్ తో మునుపటి చార్మ్ ని మిస్ అయ్యాడు.

మిగిలిన యాక్టర్స్ లో పూర్ణ కి సాలిడ్ రోల్ పడగా తన రోల్ కి ఫుల్ న్యాయం చేసింది పూర్ణ, కానీ కథలో దమ్ము లేకపోవడంతో తన పెర్ఫార్మెన్స్ వేస్ట్ అయింది, సినిమాలో కొన్ని హై సీన్స్ ఉన్నప్పటికీ కంప్లీట్ గా తెరకెక్కించిన విధానం నరేషన్ నిరాశ కలిగించింది. మొత్తం మీద ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎంటర్ టైనర్ తర్వాత ఇది డిఫెరెంట్ అటెంప్ట్ అయినా రాజ్ తరుణ్ మరోసారి అంచనాలను తప్పాడు.

సినిమాలో పూర్ణ పెర్ఫార్మెన్స్ సటిల్డ్ రాజ్ తరుణ్ పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల, రెండు మూడు సీన్స్ బాగా సెట్ అవ్వడం తప్పితే ఏమాత్రం ఆసక్తిని కలిగించలేక పోయారు, సినిమాటోగ్రఫీ బాగుండగా డైరెక్షన్ పరంగా విజయ్ కుమార్ కొండా అంచనాలను అందుకోలేక పోయాడు. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here