Home గాసిప్స్ ప్రభాస్ 20 లో రానా దగ్గుబాటి…కానీ ఫస్ట్ అనుకుంది ఈ హీరోనే!!

ప్రభాస్ 20 లో రానా దగ్గుబాటి…కానీ ఫస్ట్ అనుకుంది ఈ హీరోనే!!

460
0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు, బాహుబలి ముందు వరకు ఏడాదికి ఒక సినిమా చేసే ప్రభాస్ తర్వాత రెండేళ్ళ కి ఒక సినిమా చేస్తున్నాడు. ఇక తన అప్ కమింగ్ మూవీ అయిన ప్రభాస్20 అప్ డేట్ జూన్ లో ఉంటుంది ఉంటుంది అంటూ ఊరించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండానే నెలను ముగించారు.

ఇక సినిమా కి సంభందించిన ఓ న్యూస్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం సినిమా లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందట. ఆ రోల్ కోసం తనతో బాహుబలి సినిమా లో నటించిన రానా దగ్గుబాటి ని తీసుకున్నారని సమాచారం.

బాహుబలి లో పోటా పోటి గా నటించిన ఈ ఇద్దరినీ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా ఫ్యూచర్ లో అన్న డౌట్ ఉండేది కానీ అప్ కమింగ్ మూవీ లోనే ఇది నిజం అవుతుందని సమాచారం. కానీ ముందు ఈ రోల్ లో మరో హీరో ని అనుకున్నారట.

అతనే గోపీచంద్… ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అయిన గోపీచంద్ ని స్పెషల్ గెస్ట్ రోల్ లో తీసుకుందామని ఆల్ మోస్ట్ ఫిక్స్ అవ్వగా… తర్వాత ఎందుకనో బాహుబలి కాంబో రిపీట్ అవుతుంది కాబట్టి గోపీచంద్ ప్లేస్ లో రానా ని తీసుకున్నారని అంటున్నారు. త్వరలోనే రానా ఈ సినిమా షూట్ లో పాల్గొంటారని అంటున్నారు. ఇక ఈ సినిమా ను ముందు ఈ ఏడాది…

చివర్లో రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇయర్ లో వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ సంక్రాంతి కి లేక సమ్మర్ రేసు లో సినిమా నిలిచే అవకాశం ఎక్కువ గా ఉందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు కానీ యూనిట్ నుండి ఎలాంటి సమాచారం లేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here