Home గాసిప్స్ అక్షరాలా 400 కోట్లు…సగం వీళ్ళకే ఏంటి సామి!!

అక్షరాలా 400 కోట్లు…సగం వీళ్ళకే ఏంటి సామి!!

2332
0

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారినా అది ఒక్క సినిమా కే పరిమితం కాలేదని సాహో సినిమా తో నిరూపించిన విషయం తెలిసిందే, సాహో సినిమా డిసాస్టర్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. దాంతో ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ గా మారగా అందులో భాగంగా ఇప్పుడు చేస్తున్న….

రాదే శ్యాం సినిమా ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ ముందు నాగ్ అశ్విన్ తో సినిమా అనుకున్నా దానికన్నా ముందు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా కు కమిట్ అయిన విషయం తెలిసిందే, భారీ బడ్జెట్ తో…

తెరకేక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా కోసం టీ సిరీస్ వాళ్ళు ఏకంగా 400 కోట్ల రేంజ్ బడ్జెట్ ని కేటాయించారట. ఈ రేంజ్ బడ్జెట్ అంటే సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కడం ఖాయమని అనుకోవచ్చు కానీ…

ఇందులో సగం వరకు అందరి రెమ్యునరేషన్ లకే వెళతాయి అంటున్నారు ట్రేడ్ లో… ప్రభాస్ ప్రాఫిట్ షేర్ కూడా తీసుకోబోతున్న ముందస్తు రెమ్యునరేషన్ గా 80 కోట్ల దాకా తీసుకోబోతున్నారని సమాచారం. ఇక విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి 30 కోట్లు, డైరెక్టర్ కి 25 కోట్లు…. మరో కీలక రోల్ చేస్తున్న హీరో కి 25 కోట్లు….

ఇలా సినిమాలో పనిచేసే స్టార్ కాస్ట్ కే సుమారు 200 కోట్ల దాకా రెమ్యునరేషన్ వెళుతుందని మిగిలిన 200 కోట్ల తో సినిమా నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా తక్కువ టైం లో ఈ సినిమా తెరకెక్కి వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here