బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సాహో సినిమా తో తన రేంజ్ ఏంటో నిరూపించి మరోసారి సత్తా చాటాడు, ఇక ఇప్పుడు మరిన్ని పాన్ ఇండియా మూవీస్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు ప్రభాస్, ముందుగా జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో జాన్ సినిమా ను ముగించే పనిలో ఉన్న ప్రభాస్ ఈ సినిమా ని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బడ్జెట్ తో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్, ఎవడే సుబ్రహ్మణ్యం మరియు మహానటి సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ ఫాంటసీ ఓరియెంటెడ్ సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు ప్రభాస్..
ఈ సినిమా బడ్జెట్ టాలీవుడ్ హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొంద బోతున్న సినిమా గా చెబుతున్నారు, క్లియర్ బడ్జెట్ రివీల్ కాకున్నా కానీ ఓవరాల్ 420 కోట్ల నుండి 450 కోట్ల రేంజ్ లో ఉండబోతుంది అని సమాచారం. ఇక ఈ సినిమా లో కోలివుడ్ క్రేజీ యాక్టర్ విలన్ గా నటిస్తున్నారని టాక్.
ధృవ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కోలివుడ్ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో ముఖ్య రోల్ చేస్తారని టాక్ వినిపిస్తుంది, ఆ ముఖ్యమైన రోల్ విలన్ రోల్ అని కూడా చెబుతున్నారు. కాగా ధృవ తర్వాత విలన్ గా భారీ ఆఫర్స్ వచ్చిన రేటు ఎక్కువ చెప్పడం తో తెలుగు ఆఫర్స్ ఒప్పుకొని అరవింద్ స్వామి..
ఇప్పుడు ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటారని సమాచారం. అరవింద్ స్వామీ కూడా పాన్ ఇండియా లెవల్ లో తెలిసిన నటుడు అవ్వడం తో కచ్చితంగా సినిమా కి హెల్ప్ అవుతాడని సమాచారం. మరి దీని పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి నిజం అవుతుందో లేదో అని…