Home న్యూస్ చస్….30 ఏళ్లకి ఇండియా తరపున ఒకే ఒక్కడు రెబల్ స్టార్!

చస్….30 ఏళ్లకి ఇండియా తరపున ఒకే ఒక్కడు రెబల్ స్టార్!

317
0

ప్రభాస్…పాన్ ఇండియా సూపర్ స్టార్… బాహుబలి కోసం తను పడ్డ 5 ఏళ్ల కష్టానికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటున్నాడు ప్రభాస్. బాహుబలి కి ముందు జస్ట్ స్టార్ హీరో అయినా బాహుబలి తో నేషనల్ వైడ్ అల్టిమేట్ క్రేజ్ ఉన్న హీరో గా మారాడు. అది కేవలం ఒక్క సినిమా వండర్ కాదు అని సాహో సినిమా తో నిరూపించి తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేశాడు.

అట్టర్ డిసాస్టర్ టాక్ తో కూడా సాహో సినిమా హిందీ లో 150 కోట్ల మార్క్ కలెక్షన్స్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది అంటే అక్కడ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్రేజ్ ఎల్లలు దాటి ఇతర దేశాల్లో కూడా..’

ప్రభాస్ క్రేజ్ పవర్ ని చూపింది, లేటెస్ట్ గా రష్యా లో బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి అక్కడ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. అక్కడ టీవీ లలో కూడా బాహుబలి కి అల్టిమేట్ రెస్పాన్స్ రాగా అందరూ ప్రభాస్ కి ఓ రేంజ్ లో ఫిదా అయ్యారట.

దాంతో రష్యా అక్కడ “రష్యా ఆడియన్స్ హార్ట్” అనే అవార్డు ను ప్రభాస్ కి ఇచ్చారు, ఇక్కడ విశేషం ఏంటి అంటే… 30 ఏళ్ల క్రితం ఇండియా నుండి అక్కడ ఈ అవార్డ్ అందుకుంది రాజ్ కపూర్ అట. ఆవారా, శ్రీ 420, ఆరాధన లాంటి సినిమాలు అక్కడ మంచి పేరు తెచ్చుకోవడం తో రాజ్ కపూర్ కి అవార్డ్ ఇచ్చారట. మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళకి…

ఒక ఇండియన్ కి అవార్డ్ ఇవ్వడం ఒక్క ప్రభాస్ కే చెల్లింది అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత అవార్డ్ అందుకున్న ఓకే ఒక్కడు ప్రభాస్ అంటే అక్కడ ప్రభాస్ కి ఎలాంటి ప్రేమ దొరికిందో అర్ధం చేసుకోవచ్చు, ఇక ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కూడా అక్కడ క్రమం తప్పకుండా రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here