పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాను అనుకున్న విధంగా మేకర్స్ తీయలేక పోవడం, సినిమాలో అనేక ఫ్లాస్ ఉండటంతో…
రిలీజ్ అయిన తర్వాత నేషనల్ వైడ్ గా భారీ ట్రోల్స్ ని సొంతం చేసుకున్న సినిమా మొదటి వీకెండ్ తప్పితే తర్వాత మాత్రం అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా కి అయిన బడ్జెట్ కూడా 500 కోట్ల రేంజ్ లో ఉండగా…
బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆ బడ్జెట్ కి న్యాయం అయితే చేయలేదు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ తో భారీగానే రికవరీ అయింది. అలాగే ఈ సినిమాకి గాను రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారగా ఈ ఒక్క సినిమా కోసం కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ని ప్రభాస్…
సొంతం చేసుకున్నాడని సమాచారం. సినిమా మొదలు పెట్టె టైంలో అడ్వాన్స్ కింద 30 కోట్ల దాకా దక్కగా తర్వాత షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరో 110 కోట్ల దాకా రెమ్యునరేషన్ ప్రభాస్ కి దక్కిందట. అంటే టోటల్ గా 140 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని ప్రభాస్ ఈ సినిమాకి..
తీసుకున్నట్లు ట్రేడ్ లో స్ట్రాంగ్ టాక్ ఉండగా ఒకవేళ సినిమా కలెక్షన్స్ అంచనాలను మించిపోయి ఉంటే అందులో 10% వరకు పెర్సెంటేజ్ ప్రభాస్ కి వచ్చేదని, కానీ ఇప్పుడు సినిమా అంచనాలను అందుకోకపోవడంతో అవి మిస్ అయినట్లే అని అంటున్నారు. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే ప్రభాస్ స్టార్ డం పవర్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.