Home న్యూస్ రాధే శ్యామ్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

రాధే శ్యామ్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ పూజా హెగ్డే ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన లవ్ స్టొరీ రాధే శ్యామ్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రానే వచ్చేసింది, మరి సినిమా ఎలా ఉంది…. ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అన్న విశేషాలను తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

ఫేమస్ పామిస్ట్ అయిన హీరో ఇండియా లో పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తమ ఫ్యూచర్ గురించి చెబుతూ ఉంటాడు, అలాంటి హీరో సడెన్ గా ఇటలీ కి వెళ్ళగా అక్కడ ట్రైన్ జర్నీలో హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు… హీరోయిన్ కూడా హీరోని ఇష్టపడగా వీళ్ళ ప్రేమకి వచ్చిన అడ్డంకులు ఏంటి….

వాటిని అధిగమించి ఇద్దరు ఒకటి అయ్యారా లేదా అన్నది మొత్తం మీద సినిమా కథ…. ప్రభాస్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు కానీ కొన్ని సీన్స్ ఇబ్బందిగా చేసినట్లు అనిపించింది. కానీ తన లుక్స్ సాహో కన్నా చాలా బెటర్ గా ఉండగా, లవ్ స్టొరీ కాబట్టి పెద్దగా కష్టపడకుండా సులువగానే తన రోల్ లో మెప్పించాడు అని చెప్పాలి.

Radhe Shyam Total World Wide Pre Release Business!

ఇక పూజా హెగ్డే పర్వాలేదు అనిపించింది కానీ అక్కడక్కడా ఈ క్యారెక్టర్ కొంచం విసుగు తెప్పించేలా ఉంటుంది, ఇద్దరి పెయిర్ బాగుంది, ఇక మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా ఉన్నా కానీ ఎవ్వరికీ పెద్దగా స్కోప్ లేదు, సీనియర్ నటి భాగ్య శ్రీ గారిని సినిమాలో తీసుకున్నా అసలు ఏమాత్రం ప్రాదాన్యత లేని రోల్ ఇచ్చారు… మిగిలిన యాక్టర్స్ జస్ట్ ఓకే అనిపించుకున్నారు…

ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్స్… సాంగ్స్ ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు చాలా బాగా మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగున్నా హాస్పిటల్ ఎపిసోడ్ తెగ బోర్ కొట్టిస్తుంది…

సెకెండ్ ఆఫ్ లో డ్రాగ్ సీన్స్ కూడా చాలానే బోర్ కొట్టించాయి… సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా, విజువల్స్ అద్బుతం అనిపించేలా ఉంటాయి…. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే రాధాకృష్ణ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఆ కథకి పూర్తిగా ప్రాణం పోయలేక పోయాడు… ఫస్టాఫ్ వరకు కథ కొంచం అక్కడక్కడా బోర్ కొట్టినా చాలా వరకు మెప్పించింది…

కానీ సెకెండ్ ఆఫ్ లో మాత్రం ట్రాక్ తప్పి కొంచం ఇబ్బంది పెట్టగా భారీ ఆశలు పెట్టుకున్న సునామీ ఎపిసోడ్ బాగుంది కానీ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ అయితే కాలేదు… కానీ ఓవరాల్ గా ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ ని క్లాస్ వే లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే ప్రజెంట్ చేసి పర్వాలేదు అనిపించే మార్కులు వేయించుకున్నాడు అని చెప్పొచ్చు కానీ అంచనాలను అందుకోలేదు…

మొత్తం మీద హైలెట్స్ విషయానికి వస్తే ప్రభాస్ పెర్ఫార్మెన్స్, స్టొరీ కాన్సెప్ట్ ఐడియా బాగుండటం, క్వాలిటీ, విజువల్స్ అద్బుతంగా ఉండటం, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించడం అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… స్లో నరేషన్, కథ కనెక్ట్ అయ్యేలా చెప్పక పోవడం, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్…

మాస్ ఆడియన్స్ కి సినిమా నచ్చే అవకాశం తక్కువగా ఉండగా క్లాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, లవ్ స్టొరీలను చూడటానికి ఇష్టపడేవాళ్ళకి సినిమా నచ్చే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్ కొంచం బోర్ సీన్స్ అండ్ స్లో నరేషన్ ని ఓపికతో ఓవర్ కం చేస్తే ఎబో యావరేజ్ అనిపిస్తుంది సినిమా… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

Radhe Shyam Total World Wide Pre Release Business!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here