Home గాసిప్స్ సాహో ట్రైలర్ అప్ డేట్!…నిజం అయితే ఫ్యాన్స్ కి పూనకాలే!!

సాహో ట్రైలర్ అప్ డేట్!…నిజం అయితే ఫ్యాన్స్ కి పూనకాలే!!

75
0

  బాహుబలి లాంటి ఎపిక్ వండర్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా అద్బుతమైన ఫాలోయింగ్ పెరిగిన విషయం తెలిసిందే, ఇలాంటి సమయం లో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ అయిన సాహో పై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. కాగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో సినిమా అఫీషియల్ టీసర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు ఎదురు చూస్తుండగా ఇండస్ట్రీ లో ఓ హాట్ న్యూస్ వినిపిస్తుంది.

ఆ న్యూస్ ప్రకారం టీసర్ కాదు ఏకంగా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని సమాచారం…. ఇది కన్ఫాం న్యూస్ అనేది చెప్పలేం కానీ బాలీవుడ్ లో నుండి అందుతున్న టాక్ ప్రకారం జూన్ మొదటి వారం సాహో ట్రైలర్ 1 రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఆ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్….

లేటెస్ట్ మూవీ భారత్ తో రిలీజ్ చేస్తారని సమాచారం. దాంతో నేషనల్ వైడ్ గా బాహుబలి ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ఇది అని ఢంకా కొట్టి చెప్పునట్లు అవుతుందని సినిమాకి అల్టిమేట్ పబ్లిసిటీ అవుతుందని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది నిజం అయితే మాత్రం రెండేళ్ళు గా కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి విందు భోజనం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!