Home న్యూస్ ప్రసన్న వదనం OTT రెస్పాన్స్….అనుకున్నదే జరిగిందిగా!!

ప్రసన్న వదనం OTT రెస్పాన్స్….అనుకున్నదే జరిగిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న యంగ్ హీరో సుహాస్(Suhas) నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం(Prasanna Vadanam) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. దాంతో సినిమాకి ఆడియన్స్ నుండి మంచి కలెక్షన్స్ సొంతం అవుతాయి అనుకున్నా కూడా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరుని చూపించ లేక పోయింది…టాక్ పాజిటివ్ గానే ఉన్నా కూడా ఎలక్షన్స్ అండ్ IPL సీజన్ ఇంపాక్ట్ వలన జనాలు థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రాలేదు…దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ రిలీజ్ అయినా కూడా వాల్యూ టార్గెట్ కి దూరంగానే రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యి రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది, ఆహా వీడియోలో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమాకి డిజిటల్ లో ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ ఇక్కడ సాలిడ్ వ్యూవర్ షిప్ ను దక్కించుకుంటూ ఉండటం విశేషం…

కథ పాయింట్ యూనిక్ గా ఉండటం, చాలా వరకు సీన్స్ ఎంగేజింగ్ గా ఉండటంతో ఈజీగా ఒకసారి చూసేలా సినిమా ఉంది అంటూ సోషల్ మీడియాలో సినిమా పై రెస్పాన్స్ వస్తూ ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన సినిమా కచ్చితంగా డిజిటల్ లో…

మంచి రెస్పాన్స్ ను అలాగే మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేయగా అనుకున్నట్లే సినిమాకి ఇప్పుడు డిజిటల్ లో మంచి రెస్పాన్స్ సొంతం అవ్వడమే కాకుండా వ్యూవర్ షిప్ కూడా బాగానే సొంతం చేసుకుంటుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here