రైటర్ పద్మభూషణ్ ఈ ఇయర్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీస్ తో బాక్ టు బాక్ హిట్స్ కొట్టిన సుహాస్(Suhas) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా ప్రసన్న వదనం(Prasanna Vadanam Movie) వచ్చేశాడు. ట్రైలర్ ఆసక్తి కలిగించే విధంగా ఉండటంతో సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడగా మే మొదటి వారంలో ఆడియన్స్ ముందుకు…
వచ్చేసిన ప్రసన్న వదనం ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…ముందుగా కథ పాయింట్ కి వస్తే…చిన్నప్పుడే ఒక ప్రమాదంలో తన పేరెంట్స్ ను కోల్పోయిన హీరోకి అదే టైంలో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధి వస్తుంది…ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ ముఖాన్ని గాని గొంతుని కాని సరిగ్గా గుర్తు పట్టలేరు…అలాంటి హీరో ఒక మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటాడు….
ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద సినిమా కథ….టాలీవుడ్ కి కొంచం కొత్తగా అనిపించే పాయింట్ తో తెరకెక్కిన ప్రసన్న వదనం ఓవరాల్ గా కోర్ పాయింట్ బాగా ఆకట్టుకుంది…హీరోగా సుహాస్ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు…. తన డైలాగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా మిగిలియ యాక్టర్స్ కూడా పర్వాలేదు…
సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించేలా ఉండగా సినిమాటోగ్రఫీ మెప్పించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సుకుమార్ అసిస్టంట్ డైరెక్టర్ అయిన అర్జున్ డైరెక్టర్ గా పరిచయం అవ్వగా మంచి పాయింట్ ని తీసుకుని చాలా వరకు ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లు సినిమాను మెప్పించేలా తీశాడు…
కానీ సినిమాలో అనవసరపు లవ్ సీన్స్, కొన్ని చోట్ల కథ డ్రాగ్ అవ్వడం లాంటివి జరిగినా కూడా యూనిక్ పాయింట్ తో వచ్చిన ప్రసన్న వదనం సినిమా పార్టు పార్టులుగా బాగానే మెప్పించింది. కొన్ని సీన్స్ తర్వాత ఏమవుతుందా అన్న ఆసక్తిని బాగా పెంచగా ఆ సీన్స్ ను డైరెక్టర్ బాగా డీల్ చేశాడు కూడా…..
మొత్తం మీద సీరియస్ కథని అలాగే చెబితే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు అని కొన్ని సైడ్ ట్రాక్స్ లాంటివి పెట్టినా కూడా ఆ ట్రాక్స్ మరీ ఇంపాక్ట్ ఏమి ఇవ్వలేదు, కానీ ఓవరాల్ గా చెప్పిన పాయింట్ బాగుండటం చాలా వరకు కథ ఎంగేజింగ్ గా సాగడంతో ప్రసన్న వదనం సినిమా పూర్తి అయ్యే టైంకి ఆడియన్స్ ఒక…
డిఫెరెంట్ అండ్ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ సినిమాను ట్రై చేయోచ్చు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా లవ్ ట్రాక్ అండ్ కొన్ని సీన్స్ ను బేర్ చేస్తే ఓవరాల్ గా సినిమా అయ్యే టైంకి మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి వస్తారు. సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్..