లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు ఆల్ మోస్ట్ 4-5 సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో దేనికి కూడా సరైన టాక్ అయితే సొంతం అవ్వలేదు అని చెప్పాలి…. అన్ని సినిమాలకు మిక్సుడ్ టు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ రాగా కలెక్షన్స్ వీకెండ్ లో ఓవరాల్ గా చూసుకుంటే చాలా తక్కువగానే వచ్చాయి. కానీ ప్రజెంట్ పరిస్థితులలో ఓకే అని చెప్పొచ్చు.
ఇక ఆడియన్స్ ముందుకు మే 10 వీకెండ్ లో కూడా కొద్ది వరకు పోటి అయితే ఉంది….వాటిలో మేజర్ గా పోటి మాత్రం పొలిటికల్ నేపధ్యంలో తెరకెక్కిన నారా రోహిత్(Nara Rohit) నటించిన ప్రతినిధి2(Prathinidhi 2 Movie) సినిమా ఒకటి కాగా మరోటి సత్యదేవ్(Satyadev) నటించిన కృష్ణమ్మ(Krishnamma Movie) మూవీ….
ఈ ఇద్దరు హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు తమ లేటెస్ట్ మూవీస్ తో ఈ వీక్ లో పోటి పడబోతున్నారు. రేసులో ఎవరు గెలుస్తారో అన్నది ఆసక్తిగా మారగా ప్రజెంట్ ఉన్న పొలిటికల్ ఫీవర్ లో ప్రతినిధి2 కి టాక్ బాగుంటే కొంచం ఎడ్జ్ ఉండే అవకాశం అయితే ఉంది కానీ రీసెంట్ టైంలో వచ్చిన….
పొలిటికల్ మూవీస్ ఏవి కూడా ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేక పోయాయి… ఇక కొరటాల శివ(Koratala Siva) లాంటి టాప్ డైరెక్టర్ అండతో కొంచం బజ్ ను సొంతం చేసుకున్న కృష్ణమ్మ కంప్లీట్ గా మౌత్ టాక్ నే నమ్ముకుని ఇప్పుడు రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి…
సినిమాలో సీరియస్ స్టోరీ తో పాటు మాస్ యాక్షన్ సీన్స్ కూడా భారీగానే ఉండటంతో టాక్ కనుక బాగుంటే మాస్ సెంటర్స్ లో కొంచం జోరు చూపించవచ్చు. మరి చాలా చప్పగా సాగుతున్న ఈ సమ్మర్ లో ఈ సినిమాలు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించి మంచి రిజల్ట్ లను సొంతం చేసుకుంటాయో లేదో చూడాలి.