యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన లైగర్ సినిమా 90 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో 3000 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమాకి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది…
ఆ టాక్ ని ఒకసారి గమనిస్తే… ఓవరాల్ స్టొరీ పాయింట్ ముంబైలో అడుగు పెట్టిన రమ్యకృష్ణ మరియు విజయ్ దేవరకొండలు పేద వాళ్ళు అవ్వడంతో లైఫ్ లో ఎదో ఒకటి సాధించాలనే ధ్యేయంతో ఉండే హీరో ఫైటర్ అవుతాడు….
అతి సామాన్య మైన హీరో ఎలా ఇండియాని రిప్రసెంట్ చేసే రేంజ్ కి ఎదిగాడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన లైగర్ కొద్ది వరకు కథ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిని పోలిన కథ పాయింట్ తో వచ్చినా కానీ ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు పూరీ తెరకెక్కించిన లైగర్ ఓవరాల్ గా కథ కొంచం రొటీన్ అండ్ ఈజీగా గెస్ చేసేలా ఉన్నప్పటికీ కూడా…
ఫస్టాఫ్ కొంచం టేక్ ఆఫ్ కి టైం పట్టినా ప్రీ ఇంటర్వెల్ నుండి హై మూమెంట్స్ తో ఆకట్టుకుంటుంది అంటున్నారు, సెకెండ్ ఆఫ్ లో మైక్ టేసన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు… ఓవరాల్ గా కథ కొంచం రొటీన్ గా అనిపించినా చాలా వరకు స్క్రీన్ ప్లే మాస్ ఎలిమెంట్స్ తో ఉండటం కమర్షియల్ మూవీ లవర్స్ కి నచ్చే ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకోవడంతో….
ఒకసారి చూసే విధంగా ఉంటుందని అంటున్నారు… మొత్తం మీద టాక్ యావరేజ్ టు ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా సినిమా ఉంటుందని, కమర్షియల్ మూవీ అండ్ మాస్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుందని అంటున్నారు. మరి రెగ్యులర్ షోలకు లైగర్ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…