Home గాసిప్స్ హీరోని బ్లాక్ లిస్ట్ చేసిన నిర్మాత…20 రోజుల షూటింగ్ తర్వాత సినిమా నుండి తప్పుకున్న హీరో…అసలేం...

హీరోని బ్లాక్ లిస్ట్ చేసిన నిర్మాత…20 రోజుల షూటింగ్ తర్వాత సినిమా నుండి తప్పుకున్న హీరో…అసలేం జరిగింది అంటే!

10695
0

ఒక సినిమా షూటింగ్ టైం లో అప్పుడప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ లు వస్తూ ఉంటాయి, కొందరు సద్దుకుంటారు, కొందరు ఎక్స్ ట్రీమ్స్ కి వెళతారు, లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఇలాంటిదే జరిగి కొంచం ఎక్స్ ట్రీమ్స్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ లలో ఒకరైన కరణ్ జోహార్ ఓ యంగ్ హీరో ని తన ప్రొడక్షన్ లో ఇక మీదట యాక్ట్ చేయనివ్వకుండా బ్యాన్ చేసేశాడు.

ఆ యంగ్ హీరో ప్యార్ కా పంచనామ, సోను కే టీటు కి స్వీటి మూవీ హీరో కార్తిక్ ఆర్యన్… కొన్ని సినిమాలతోనే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో కి బాలీవుడ్ లో వరుస పెట్టి ఆఫర్స్ వస్తూ ఉండగా కరణ్ జోహార్ నిర్మాణంలో….

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన దొస్తానా సినిమా కి సీక్వెల్ గా దొస్తానా 2 ని మొదలు పెట్టగా ఆ సినిమా షూటింగ్ లో 20 రోజుల పాటు పాల్గొన్న హీరో తర్వాత పెరిగిన కరోనా కేసుల వలన షూటింగ్స్ కి బ్రేక్ ఇస్తున్నాని చెప్పుకొచ్చాడట, కరణ్ జోహార్ ఫోర్స్ చేసినా నో అన్నాడట…

కానీ అదే టైం లో మరో సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడని తెలిసి కరణ్ జోహార్ కి కోపం రాగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగడం తో కరణ్ జోహార్ సినిమా నుండి హీరో తప్పుకుంటున్నట్లు తెలియజేశాడట. దాంతో కరణ్ జోహార్ సినిమా ఒప్పందాన్ని చింపేసి, హీరో కార్తిక్ ఆర్యన్ ని కరణ్ జోహార్ బ్యానర్ అయిన…

ధర్మా ప్రొడక్షన్ నుండి కంప్లీట్ గా బ్యాన్ చేస్తున్నట్లు అల్టిమేటం ఇచ్చారట. బాలీవుడ్ లో ప్రజెంట్ మోస్ట్ హ్యాప్పెనింగ్ స్టొరీ ఇదీ… ఇందులో ఎవరిదీ తప్పు అన్నది చెప్పలేం కానీ ఇద్దరి ఈగోల గొడవల వలన ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. త్వరలోనే కరణ్ జోహార్ కొత్త కాస్ట్ అండ్ క్రూ ని అనౌన్స్ చేస్తామని చెప్పారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here