బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సక్సెస్ చూసి అలాంటి భారీ హంగుల సినిమాను తీయాలి అని అన్ని ఇండస్ట్రీలు ఆశ పడగా కోలివుడ్ కూడా ఏకంగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నంతో ఏకంగా 500 కోట్ల రేంజ్ బడ్జెట్ తో 2 పార్టులుగా కల్కి నవల పొన్నియన్ సెల్వన్ కథని అదే పేరుతో సినిమాగా మార్చగా విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ఇలా అత్యంత భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా అఫీషియల్…
ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. తెలుగు లో కూడా డబ్ అయిన ఈ సినిమా ట్రైలర్ క్వాలిటీ పరంగా సెట్స్ పరంగా విజువల్స్ పరంగా చాలా బాగా ఇంప్రెస్ చేసింది కానీ కథ నేటివిటీ కంప్లీట్ గా తమిళ వాళ్ళని దృష్టిలో…
పెట్టుకుని అక్కడ జరిగిన చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అవ్వడంతో మనకు అంత కనెక్ట్ అవ్వలేక పోయింది కానీ ఓవరాల్ గా విజువల్స్ గ్రాండియర్ గా ఉండటంతో సినిమా పై ఇప్పటి వరకు ఏర్పడని ఆసక్తిని కొద్ది వరకు క్రియేట్ చేయడంలో మాత్రం ఈ సినిమా ట్రైలర్ సఫలం అయింది అని చెప్పాలి ఇప్పుడు….
చరిత్రలో నిజంగా జరిగిన ఈ కథని సినిమాగా తీయాలి అని కోలివుడ్ సినీ లవర్స్ ఎప్పటి నుండో కోరుకుంటూ ఉండగా మణిరత్నం లాంటి సీనియర్ డైరెక్టర్ భారీ స్టార్ కాస్ట్ తో చేస్తున్న ఈ సినిమా ఈ నెల 30 న ఆడియన్స్ ముందుకు తమిళ్ తో పాటు ఇండియాలో మేజర్ భాషలు అన్నింటిలో కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి…
కానీ ఓవరాల్ గా సినిమా బడ్జెట్ దృశ్యా బాహుబలి సిరీస్, కేజిఎఫ్ సిరీస్, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాల రేంజ్ బజ్ ను మాత్రం ట్రైలర్ అందుకోలేదు అని చెప్పాలి. రిలీజ్ సమయానికి సినిమాకి సాలిడ్ హైప్ వస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా కలెక్షన్స్ జోరు చూపించవచ్చు. లేదా కోలివుడ్ పైనే ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది.