బాక్స్ ఆఫీస్ దగ్గర సీక్వెల్ మూవీస్ మొదటి పార్ట్ కన్నా కూడా భారీ వసూళ్ళని సాధిస్తూ ఉంటాయి కానీ పొన్నియన్ సెల్వన్ మూవీ పార్ట్ 2 మాత్రం పార్ట్ 1 తో పోల్చితే చాలా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. మొదటి రోజు పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా 82.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే…
పార్ట్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 59.12 కోట్ల మార్క్ గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు పార్ట్ 1 మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 65.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేస్తే పార్ట్ 2 మూవీ ఇప్పుడు టోటల్ గా…
50.48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ కన్నా కూడా రెండో పార్ట్ టాక్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మొదటి పార్ట్ ను మ్యాచ్ చేయలేక పోతుంది. మొత్తం మీద 2 రోజుల్లో పార్ట్ 1 మూవీ 147.60 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంటే…
పార్ట్ 2 మూవీ మొత్తం మీద 109.60 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకుని పార్ట్ 1 కన్నా కూడా 38 కోట్లు ఇప్పుడు వెనకబడి ఉందని చెప్పాలి. ఇక మూడో రోజు కూడా పార్ట్ 1 తో పోటిలో పార్ట్ 2 ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కానీ 4వ రోజు హాలిడే ఉండటంతో కలెక్షన్స్ పరంగా జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి.