బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న బిగ్గీ పొన్నియన్ సెల్వన్ సినిమా పార్ట్ 1 భారీ లెవల్ లో అన్ని చోట్లా రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా మంచి అంచనాలతోనే బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతూ ఉందని చెప్పాలి కానీ కోలివుడ్ ఫ్యాన్స్ ఆశించినట్లు మరీ బాహుబలి రేంజ్ లో అయితే బజ్ ఏమాత్రం లేదనే చెప్పాలి. ఓ నార్మల్ డబ్బింగ్ మూవీ…
రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అలాంటి బజ్ నే సొంతం చేసుకుని ఇప్పుడు బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు లో…
10.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా మొత్తం మీద నైజాంలో 190 వరకు థియేటర్స్ లో సీడెడ్ లో 100 వరకు థియేటర్స్ లో టోటల్ ఆంధ్ర లో 260 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది.
దాంతో సినిమా తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా 10.5 కోట్ల టార్గెట్ ను ఈ థియేటర్స్ లో సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, ఈ వారం అంటే పెద్దగా పోటి ఏమి లేదు కానీ వచ్చే వారం బిగ్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటంతో ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.