బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి నాన్ స్టాప్ గా బాహుబలితో కంపేర్ చేస్తూ ఈ సినిమా అన్ని చోట్లా అద్బుతాలు సృష్టిస్తుంది అంటూ నమ్మకంతో ట్రోల్స్ కూడా చేసిన కోలివుడ్ ఫ్యాన్స్ మణిరత్నం లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ సినిమా పార్ట్ 1 కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 30న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి….
తమిళనాడు అవతల రిలీజ్ కి కొన్ని రోజులే ఉన్నా కానీ బజ్ అయితే ఏమాత్రం లేదనే చెప్పాలి. కానీ అదే టైం లో సినిమా కి తమిళనాడులో మాత్రం సెన్సేషనల్ బజ్ ఏర్పడగా అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
అదే టైం లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో కొనసాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. అక్కడ కబాలి తర్వాత ది బెస్ట్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా PS1 సినిమా నిలిచింది. అమెరికాలో సినిమా కి..
ఎక్స్ లెంట్ బజ్ సొంతం చేసుకుంది, అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోగా అమెరికాలో సినిమా ప్రీమియర్స్ తో 1 మిలియన్ రేంజ్ లో కుదిరితే అంతకన్నా మించి ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ తమిళనాడులో ఓవర్సీస్ లో తప్పితే మిగిలిన చోట్ల మాత్రం సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కానుంది అని చెప్పాలి ఇప్పుడు. టాక్ బాగుంటే సినిమా….
కలెక్షన్స్ పరంగా దసరా వరకు రచ్చ చేసే అవకాశం ఉంటుంది, తర్వాత దసరా సినిమాల టాక్ ని బట్టి ఏ సినిమా దసరా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి. మొత్తం మీద పొన్నియన్ సెల్వన్ సినిమా బాహుబలి రేంజ్ ని అందుకోలేదు కానీ ఉన్నంతలో టాక్ బాగుంటే సినిమా రేంజ్ కి తగ్గట్లు ఆకట్టుకునే అవకాశం ఉంది.