ఈ వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతున్న భారీ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తమిళనాడులో భారీ ఎత్తున రిలీజ్ కానుండగా మిగిలిన ఇండస్ట్రీలలో కూడా క్రేజ్ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉండటం విశేషం కాగా సినిమా కి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఉంది. సినిమా మిగిలిన ఇండస్ట్రీ లలో ఎలా ఉన్నప్పటికీ కూడా…
తమిళనాడులో మాత్రం ఈ సినిమా పై క్రేజ్ ఎక్స్ లెంట్ గా ఉండగా అక్కడ అడ్వాన్స్ టికెట్ సేల్స్ మాత్రం ఊరమాస్ గా జరుగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. రిలీజ్ కి 2 రోజుల ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా…
సినిమా ఆల్ మోస్ట్ 10.65 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. దాంతో సినిమా తొలిరోజు తమిళనాడులో అవలీలగా 22 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఓపెనింగ్స్ సినిమాలో నటించిన హీరోల కెరీర్ లలోనే ఆల్ టైం ఎపిక్ రికార్డ్…
ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక సినిమాకి టాక్ బాగుంటే ఈ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉంది. మొత్తం మీద ఎక్స్ లెంట్ బజ్ ను తమిళనాడులో సొంతం చేసుకున్న ఈ సినిమా మిగిలిన ఇండస్ట్రీలలో ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని జోరు చూపిస్తుందో చూడాలి.