లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ ఇండస్ట్రీ రికార్దులను తిరగ రాసిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా కి సీక్వెల్ గా వస్తున్న కొత్త సినిమా పొన్నియన్ సెల్వన్ 2 సినిమా భారీ లెవల్ లోనే రిలీజ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పెద్దగా బజ్ అయితే లేదనే చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాలలో అసలు మినిమమ్ బజ్ కూడా లేని సినిమా ఆల్ మోస్ట్ మొదటి పార్ట్ మాదిరిగానే 10.5 కోట్లకు పైగా…
బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
👉Nizam – 115
👉Ceeded – 40~
👉Andhra – 185~
AP TG – 340~
ఇదీ ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యి….
మూడు నాలుగు రోజులు అవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఏమాత్రం జోరు చూపించడం లేదు, దాంతో సినిమా టాక్ పైనే డిపెండ్ అవ్వగా టాక్ బాగుంటే పోటిలో రిలీజ్ అవుతూ ఉండటం తో 1.5 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు.
ఇక తమిళనాడులో బుకింగ్స్ చాలా తక్కువగా తొలిరోజు 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా… ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ బుకింగ్స్ ని బట్టి 35-40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక సినిమా ఈ అంచనాలను మించుతుందో లేదో చూడాలి… కానీ మొదటి పార్ట్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా తక్కువే అని చెప్పాలి.