లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా తమిళ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోగా మిగిలిన ఇండస్ట్రీలలో మాత్రం యావరేజ్ గానే నిలిచింది. కానీ తమిళ్ వర్షన్ అద్బుతమైన కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా ఇప్పుడు పార్ట్ 2 భారీ లెవల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా తెలుగు లో కూడా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ పార్ట్ 2 ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… మొదటి పార్ట్ ఎండ్ లో సముద్రంలో జయం రవి మరియు కార్తీలు మునిగిపోతూ ఉన్న టైంలో ఐశ్వర్య లక్ష్మీ మరియు ముసలావిడ అయిన ఐశ్వర్య రాయ్ లు కాపాడతారు, మరో పక్క విక్రమ్ మరియు నందిని అయిన ఐశ్వర్య రాయ్ ల ప్రేమ కథ ఎలా మొదలైందో చూపెడతారు… కట్ చేస్తే తర్వాత జరిగిన పరిణామాల తరువాత ఐశ్వర్య రాయ్ ఎలా చోళులు అందరినీ అంతమొందించాలి అనుకుంది.. చోళులు వీళ్ళని ఎలా ఎదిరించారు అన్నది కథ…
మొదటి పార్ట్ తో పోల్చితే రెండో పార్ట్ కి తెలుగు ఆడియన్స్ కి కొంచం కనెక్ట్ అయ్యారు అని చెప్పాలి. మొదటి పార్ట్ వచ్చే టైం లో ఈ కథ పాయింట్ గురించి తెలిసినా పాత్రల రిలేషన్ కానీ పూర్తీ కథ కానీ చాలా మందికి తెలియదు, కానీ పార్ట్ 1 రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో పూర్తీ కథకి సంభందించిన వీడియోలు చాలా రావడంతో పూర్తీ కథ చాలా మందికి తెలిసింది.
అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్ట్ 2 కి ఈజీగా కనెక్ట్ అవ్వడం ఖాయం, రెండో పార్ట్ లో కథని మరింత బాగా చెప్పారు మణిరత్నం గారు, కానీ మొదటి పార్ట్ మాదిరిగానే కథ స్లో గా సాగుతుంది, అక్కడక్కడా కొంచం ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది అయినా కానీ కొంచం ఓపిక పట్టి చూస్తె మొదటి పార్ట్ కన్నా కూడా రెండో పార్ట్ మెప్పించడం ఖాయం…
పెర్ఫార్మెన్స్ పరంగా అందరూ అద్బుతంగా నటించారు, కానీ కార్తీ ఎక్కువగా తన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ కామెడీతో మెప్పించాడు, విక్రమ్ మరోసారి ఆకట్టుకోగా జయం రవి పర్వాలేదు అనిపిస్తాడు, ఐశ్వర్య రాయ్ తన రోల్ తో మెప్పించగా త్రిష కూడా ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపిస్తారు. ఇక రెహమాన్ సంగీతం జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నప్పటికీ…
కొన్ని సీన్స్ కి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లో గా సాగుతుంది, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి, డైరెక్షన్ విషయానికి వస్తే మణిరత్నం పార్ట్ 2 విషయంలో బాగానే సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. పార్ట్ 1 లో మిస్ అయిన లింక్స్ చాలా వరకు పార్ట్ 2 లో క్లియర్ చేశారు…
మొత్తం మీద స్లో నరేషన్, లెంత్ ఎక్కువ అవ్వడం, అలాగే కొందరికీ కథ ఇప్పటికీ కొంచం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసేలా ఉండటం లాంటివి డ్రా బ్యాక్స్ ఉన్నా కూడా పార్ట్ 1 కన్నా కూడా ఓవరాల్ గా పార్ట్ 2 ని బాగా డీల్ చేసి మెప్పించారు టీం… ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది పొన్నియన్ సెల్వన్ 2 సినిమా….సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…